Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిమెంట్ షేర్ల ర్యాలీ...

ముంబై : సిమెంట్ షేర్లలో మంగళవారం  ర్యాలీ చోటు చేసుకుంది. ముడిసరుకు ధరలు పెరిగినప్పటికీ, డిమాండ్‌ను అందిపుచ్చుకోవడంతో దానిని బ్యాలెన్స్ చేయగలవనే అంచనాలతోనే ఈ కంపెనీల స్టాక్స్‌లో భారీగా కొనుగోళ్లు చోటు చేసుకుంటున్నట్లు వినవస్తోంది. కాగా... మొత్తం ఈ రంగంలోని అన్ని కంపెనీలూ కాకుండా, నష్టాలను  పూడ్చుకోగల, ఖర్చును నియంత్రించుకోగల సామర్ధ్యంమున్న కొన్ని కౌంటర్లలోనే స్పెసిఫిక్ యాక్షన్ చోటు చేసుకుంటుందని భావిస్తున్నారు. 


ఈ క్రమంలో... గుజరాత్ అంబుజా సిమెంట్స్ షేర్లు 6 శాతం వరకు పెరిగి రూ. 360 ధరను తాకాయి. ఇక... జేకే లక్ష్మి సిమెంట్ షేర్లు 4 శాతం పెరిగి రూ. 622.50 కు ఎగబాకాయి. మిగిలిన సిమెంట్ కంపెనీల షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీ, ఓరియంట్ సిమెంట్, స్టార్, ఇండియా, ది రాంకో, శ్రీ సిమెంట్స్, జేకే సిమెంట్స్ షేర్లు 3-5 శాతం వరకు పెరగడం విశేషం. ఇక... నెల ప్రాతిపదికగా చూసినప్పుడు మొత్తం ఇండస్ట్రీలో అమ్మకాల పరిమాణం ఏప్రిల్ నాటికి చేరుకున్నట్లు జూన్ నెలలోని అమ్మకాలను బట్టి ఇండస్ట్రీ అంచనా వేసింది. పెంటప్ డిమాండ్, ఆంక్షల సడలింపులతో ఉత్త భారతదేశంలో నిర్మాణరంగపు వేగం పెరిగిందని భావిస్తున్నారు. ఎంకే గ్లోబల్ పైనాన్షియల్ సర్వీసెస్ రాబోయే త్రైమాసికాలల్లో నిర్మాణరంగంలో డిమాండ్ ఇంకా పెరుగుతుందని అంచనా వేసింది. ఇలా పలు అంచనాల తర్వాత ఈ సిమెంట్ స్టాక్స్ జోరుగా ట్రేడవుతున్నాయి. 

Advertisement
Advertisement