మాస్కు లేకుంటే... కేసులే

ABN , First Publish Date - 2021-04-13T05:52:38+05:30 IST

ఇప్పటివరకు మాస్కు ధరించకుంటే రూ.100 జరిమానా మాత్రమే విధించామని, ఇకనుంచి కేసులు నమోదు చేసి వాహ నాలు సీజ్‌ చేస్తామని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.

మాస్కు లేకుంటే...  కేసులే
ర్యాలీలో పాల్గొన్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తదితరులు

కరోనాపై అవగాహన ర్యాలీ


గుంటూరు, ఏప్రిల్‌ 12:  ఇప్పటివరకు మాస్కు ధరించకుంటే రూ.100 జరిమానా మాత్రమే విధించామని, ఇకనుంచి కేసులు నమోదు చేసి వాహ నాలు సీజ్‌ చేస్తామని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. కరోనాపై అవ గాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ప్లకార్డులు, కరోనా మాస్కులతో ఎస్పీతోపాటు డీఎస్పీలు సీతారామయ్య, కె.సుప్రజ, రమణకు మార్‌, రవికుమార్‌, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి ఆయన ర్యాలీలో పా ల్గొన్నారు. దీనిలో భాగంగా ఎంఆర్‌టి సెంటరు నుంచి లాడ్జి సెంటరు వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్లపై తనిఖీలే కాకుం డా సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర ప్రదేశాల్లో కరోనా నిబంధనలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. దీనిని దృష్టి లో ఉంచుకుని ప్రజలందరూ అత్యవసరమైతేనే బయటకు రావాలని,  తప్పనిసరిగా నిబంధనలు పాటించి మాస్కులు ధరించాలని సూచించారు. 

Updated Date - 2021-04-13T05:52:38+05:30 IST