మువ్వన్నెలు మురిసె

ABN , First Publish Date - 2022-08-14T05:48:44+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

మువ్వన్నెలు మురిసె
కైకలూరులో భారీ జాతీయ జెండాతో ర్యాలీ

జాతీయ జెండాలతో ప్రదర్శనలు


ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. మహనీయుల త్యాగాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలని వక్తలు సూచిస్తున్నారు. కైకలూరులో కిలో మీటరు పొడవైన జాతీయ జెండాతో విద్యార్థులు  ర్యాలీ నిర్వహించారు. ఇంకా పలు చోట్ల భారీ జెండాలతో ర్యాలీలు జరిగాయి. సమరయోధులు,  నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.


కైకలూరు, ఆగస్టు 13: కిలోమీటరు పొడవైన భారీ జాతీయ జెండాతో   కైకలూరు నేషనల్‌ స్కూల్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 2 వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మా ట్లాడుతూ యువత దేశభక్తిని పెంపొందించుకుని దేశాభ్యున్నతికి పాటుపడా లన్నారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ మాట్లాడుతూ మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని జాతీయ సమైక్యతకు కృషి చేయాలన్నారు.   జడ్పీటీసీ కురెళ్ళ బేఠిట, కైకలూరు సర్పంచ్‌ నవరత్న కుమారి, నేషనల్‌ స్కూల్‌ కరస్పాం డెంట్‌ జి.చంద్రమోహన్‌, జి.శ్రీనివాస్‌, జి.రాజశేఖర్‌, ఎంఈవో డి.రామారావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అల్లూరి రవిప్రకాష్‌,  అధికారులు పాల్గొన్నారు. కైకలూరు శ్రీ శ్యామల కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్‌ నవరత్నకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘ సభ్యులు కొణిజేటి పాండురంగారావు, గొల్లు రంగారావు, వరదా మల్లికార్జునరావు, కిరాణా కొట్టు రాజు, పొన్నూరి పురుషోత్తం, ముగుళ్ళూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి: ముదినేపల్లిలోని సహాయ మాత ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ విద్యార్థులు 75 సంఖ్య ఆకృతిలో ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ నాయకులు కోటప్రోలు కృష్ణారావు, సత్యవోలు నాగలక్ష్మి, జనసేన నాయకుడు వర్రె హనుమాన్‌ ప్రసాద్‌ ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలసి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శీలం రామకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు, ఏపీటీఎఫ్‌ నాయకుడు పి.జాన్సన్‌ బాబు ర్యాలీలో పాల్గొన్నారు.   అల్లూరులో  తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దావు నాగరాజు పలువురు టీడీపీ నాయకులతో కలసి  ర్యాలీ నిర్వహించారు. 

కలిదిండి: గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు.  కోరుకొల్లులో సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ విద్యార్థులతో కలసి జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

మండవల్లి: మండవల్లి జాతీయ రహదారిపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఐ టి.రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వాతంత్ర్యోద్యమంలో నాయకుల త్యాగాలను వివరించారు. కార్యదర్శి డీవీఎస్‌ జానకి, గ్రామస్థులు మెండా సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ముసునూరు: ప్రతి ఇంటా ఆగస్టు 15న జాతీయ జెండా ఎగరాలని ఎంపీడీవో బసవరాజు అచ్యుత సత్యనారాయణ అన్నారు. శనివారం ముసునూరులో భారతీయ విద్యానికేతన్‌ ప్రిన్సిపాల్‌ కొండేటి శౌరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 75 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించా రు.  మండలంలోని 16 గ్రామాల్లో పంపిణీకి 6 వేలు జెండాలు వచ్చాయని, వీటిని వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందిస్తున్నట్టు తెలిపారు.  జడ్పీటీసీ వరకూటి ప్రతాప్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చెక్కపల్లి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్‌ మరీదు నాగరాజు ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. 

చాట్రాయి:  సమరయోధుల త్యాగాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని చాట్రాయి, చనుబండ సర్పంచ్‌లు ఉష, జ్యోతి సూచించారు. చాట్రాయి, చనుబండ–1, 2 సచివాలయాల ఆధ్వర్యంలో సిబ్బంది, వలంటీర్లు, విద్యార్థులు, పౌరులతో ర్యాలీ నిర్వహించారు. జెండాలను పంపిణీ చేశారు. పోతనపల్లిలో యూపీ స్కూల్‌ హెచ్‌ఎం తిరుపతయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

నూజివీడు టౌన్‌: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు.  న్యాయవాదులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, పోలీసులు, ఆగిరిపల్లి జడ్పీ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటికి  జెండాలు పంపిణీ  చేశారు. తోటపల్లిలో 75 అక్షర రూపంలో విద్యార్థులు మానవహారం నిర్మించా రు. ఈదులగూడెంలో జడ్పీ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 



Updated Date - 2022-08-14T05:48:44+05:30 IST