Abn logo
May 20 2020 @ 08:50AM

రకుల్ కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా?

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని తల్లకిందులు చేసింది. ఏ రంగాన్నీ వదలకుండా అన్నింటి పైనా తీవ్ర ప్రభావం చూపించింది. కరోనా ధాటికి సినీ పరిశ్రమ తీవ్రంగా కుదేలైంది. పూర్తిగా ఆగిపోయిన సినీ పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు సినీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకుముందులా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ స్వచ్ఛందంగానే తన పారితోషికాన్ని తగ్గించింది. తాజాగా మరో హీరోయిన్ రకుల్ కూడా అదే బాటలో పయనించబోతున్నట్టు తెలుస్తోంది. ఇకపై తన పారితోషికాన్ని తగ్గించుకోవాలని రకుల్ నిర్ణయించుకుందట. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నాటి నుంచి `మన్మథుడు-2` వరకు రకుల్ ఒక్కో సినిమాకు రూ.కోటి రూపాయలు తీసుకునేదని టాక్. ఇకపై దానిలో 30 నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవడానికి రకుల్ సిద్ధంగా ఉందట. 


Advertisement
Advertisement
Advertisement