May 8 2021 @ 15:19PM

వచ్చే ఏడాది రకుల్‌ పెళ్లట!

తెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్‌కి చాలా పెద్ద ఫ్రెండ్‌ బ్యాచే ఉంది. రాశీఖన్నా, రానా, సాయిధరమ్‌ తేజ్‌, సందీప్‌ కిషన్‌, రెజీనా, రవితేజ  మరీ ముఖ్యంగా మంచు లక్ష్మి. వీకెండ్‌లో వీరు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎవరో ఒకరి ఇంట్లో పార్టీ పెట్టుకుని ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇటీవల వీరిద్దరూ రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నెం.1యారీ షోకు వెళ్లారు. అక్కడ రకుల్‌ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఈ ఏడాదిలోనే రకుల్‌ పెళ్లి ఉంటుందని లక్ష్మి ప్రకటించింది. ఇప్పట్లో నా పెళ్లి లేదంటూ ఎంత వారించినా పెళ్లి ప్రయత్నాలైనా జరుగుతాయనీ, లేకపోతే బాయ్‌ఫ్రెండ్‌ రావచ్చని లక్ష్మి తెలిపింది. రకుల్‌కి కాబోయే అబ్బాయి ఎవరో తన వద్దకు వస్తే రకుల్‌ గురించి అన్ని విషయాలు చెబుతానని బదులిచ్చింది. గతంలో రానా, రకుల్‌ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలను రకుల్‌ ఖండించింది. మేమిద్దం మంచి స్నేహితులం అని సెలవిచ్చింది. ప్రస్తుతం రకుల్‌ క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమాలో నటిస్తుంది.