Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 23 May 2022 13:14:19 IST

Rakul preethsingh: మా బంధాన్ని దాచాలనుకోలేదు!

twitter-iconwatsapp-iconfb-icon

ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌(Rakul preeth singh) తన ప్రియుడు జాకీ భగ్నానీ (jockey bagnani)గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇటీవల ‘రన్‌ వే 34’తో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన ఆమె నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌ పరంగా ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ప్రియుడితో తన బంధాన్ని రహస్యంగా ఉంచాలనుకోవడం లేదని చెప్పారు. గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా తన ప్రియుడు జాకీని పరిచయం చేశారు రకుల్‌. ఇద్దరు టూర్‌లకు వెళ్లిన ఫొటోలు షేర్‌ చేసి వారి బంధం గురించి తెలిపారు. అప్పటి నుంచి అభిమానులు వీరిద్దరు ఎప్పుడు ఒకటవుతారా అని ఎదురుచూస్తున్నారు.


తాజా ఇంటర్వ్యూలో రకుల్‌ మాట్లాడుతూ ‘‘మన జీవితాల్లో తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఎలాగైతే ఉంటారో..  వ్యక్తిగత జీవితం కోసం మనకంటూ ఓ వ్యక్తి ఉంటారు. నాకు జాకీ అలాంటి వ్యక్తి. మేమిద్దరం మంచి స్నేహితులం. మా అభిరుచులు, విధానాలు కలవడంతో ప్రేమలో పడ్డాం. మేము రిలేషన్‌లో ఉన్నాం అని గమనించగానే ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. అందుకు కారణం లేకపోలేదు. మేం మా విషయాన్ని గోప్యంగా ఉంచితే మాపై రోజూ వార్తలు వస్తాయి. అసత్య ప్రచారాలతో మనసుకు ప్రశాంతత ఉండదు. మా వ్యక్తిగత జీవితం గురించి కన్నా మేం చేసే వర్క్‌ గురించి అందరూ మాట్లాడుకోవాలి. నేను సెలబ్రిటీని కావడంతో అందరూ మాపైనే దృష్టి పెడతారు. నేను న్యూస్‌ కాకూడదు అనుకునే రిలేషన్‌లో ఉన్న విషయాన్ని దాచుకోకుండా బయటకు చెప్పేశా’’ అని రకుల్‌ చెప్పారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు హిందీ చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. ‘కొండపొలం’ తర్వాత తెలుగులో మరో చిత్రానికి సైన్‌ చేయలేదు రకుల్‌. (Rakul preeth love affair)



Rakul preethsingh: మా బంధాన్ని దాచాలనుకోలేదు!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International