ధ్రువ, సరైనోడు, స్పైడర్ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటి రకుల్ ప్రీత్ సింగ్ . టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను సినిమాలు చేస్తూ బిజీగా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది. అక్టోబర్ 10న తన పుట్టిన రోజు వేడుకలను ఆమె ఘనంగా జరుపుకొంది. తన పుట్టిన రోజున ఆమె ఒక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్టు ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది. భగ్నానీ డిసెంబర్ 25న జన్మించారు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.
ఇన్‌స్టాగ్రాంలో భగ్నానీ ఫొటోను రకుల్ పోస్ట్ చేసింది. స్వీట్‌గా శుభాకాంక్షలు చెప్పింది. ‘‘ హ్యాపీ బర్త్ డే మై సన్‌షైన్. నువ్వు ఎల్లప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఇతరులను కూడా నవ్విస్తూ ఉండాలి. హ్యాపీ బర్త్‌డే ’’ అని ఇన్‌స్టాగ్రాంలో రకుల్ పోస్ట్ పెట్టింది. ఆమె బాలీవుడ్లో ‘‘ అయ్యారీ ’’ చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. దే దే ప్యార్లోను అజయ్ దేవగణ్, టబు సరసన నటించింది. ప్రస్తుతం ఆమె రన్ వే-34 సినిమాలో నటిస్తోంది.