రకుల్ ప్రీత్ సింగ్.. స్టార్ హీరోయిన్. టాలీవుడ్‌ని ఒకానొక టైమ్‌లో రఫ్ ఆడించిన రకుల్.. ఇప్పుడు టాలీవుడ్ కాకుండా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ నాలుగైదు సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరికలేకుండా గడుపుతోంది. అయితే లాక్డౌన్ టైమ్‌లో ఈ భామ గురించి ఎటువంటి వార్తలు వచ్చాయో తెలియంది కాదు. ప్రస్తుతం ఆమె చేతిలో చిత్రాలు లేవని, ఆమె పని అయిపోయిందని అంతా వార్తలు వ్యాపించాయి. కానీ రకుల్ మాత్రం మౌనమే సమాధానం అన్నట్లుగా తన పని తాను చేసుకుంది. తాజాగా ఆమె నటించిన 'చెక్' సినిమా విడుదలై.. మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ.. ''చెక్ ఏ తరహా చిత్రమనేది నేను ఆలోచించలేదు. నాకు స్ర్కిప్ట్ నచ్చింది. మేం ఓ ప్రయత్నం చేశాం. నేనెప్పుడూ ఆలోచించేది ఒక్కటే. నాతోనే నాకు పోటీ. అంటే నా లాస్ట్ సినిమాకి, ప్రజెంట్ సినిమాకి కంపేర్ చేస్తే.. నా పర్ఫార్మెన్స్ మెరుగవ్వాలి. నేనెప్పుడూ ఆలోచించేది అదే. అది చెక్‌లో చాలా ఇంప్రూల్ అయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేశా. అందులో వైష్ణవ్ తేజ్ హీరో. మేమిద్దం గ్రామీణ యువతీయువకుల పాత్రల్లో నటించాం. డిఫరెంట్ రోల్ కాబట్టి ఎగ్జైట్ అయ్యా. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తున్నా. అందులో నాలుగు కమర్షియల్ సినిమాలే. ఇంకొకటి డిఫరెంట్ సినిమా. ఏ సినిమాలను అయితే ఐదేళ్ల క్రితం కమర్షియల్ కాదని అన్నారో... ఇప్పుడు అవే కమర్షియల్ సినిమాలు అయ్యాయి. ఐదేళ్ల క్రితం ఒక సెక్షన్/సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ కోసం తీసే సినిమాలు అని వేటిని అనుకున్నావో... ఇప్పుడు ఆ సినిమాలను అందరూ చూస్తున్నారు. ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాలు, ఓటీటీల్లో మంచి కంటెంట్ చూస్తున్నారు. అందువల్ల, ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు ప్రయత్నిస్తూ ఉండాలి. మళ్లీ సేమ్ సినిమాలు రిపీట్ చేస్తే... ఆడియన్స్‌కి బోర్ కొడుతుంది.." అని తెలిపింది.