Sep 17 2021 @ 23:29PM

గుర్తుండిపోయేలా...

నాజూకు అందాలతో టాలీవుడ్‌లో మరపురాని విజయాలను సొంతం చేసుకున్నారు కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఇప్పుడామె బాలీవుడ్‌ చిత్రాల్లో తన హవా చూపుతున్నారు. తాజాగా రకుల్‌ నటిస్తున్న చిత్రం ‘డాక్టర్‌ జీ’. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడు. ఇందులో ఆమె డాక్టర్‌ ఫాతిమా అనే వైద్య విద్యార్థిని పాత్రను పోషిస్తున్నారు. పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఇటీవలె విడుదల చేసింది. తెలుపు రంగు కోటు, చేతిలో స్టెతస్కోపుతో ఆమె పాత్రను పరిచయం చేశారు. ‘ఫాతిమా పాత్ర, సినిమా కథ నాకు చాలా బాగా నచ్చాయి. పాత్రను అవగాహన చేసుకొని నటించడం నాకు మంచి అనుభవం. ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని రకుల్‌ అన్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ‘మేడే’, ‘థాంక్‌ గాడ్‌’, ‘అటాక్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Bollywoodమరిన్ని...