Abn logo
Sep 21 2020 @ 13:46PM

వికారాబాద్‌లో రకుల్!

Kaakateeya

టాలీవుడ్ ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి.. రకుల్ పేరును వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో రకుల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి హైకోర్టును ఆశ్రయించింది. 


తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న కథనాలను ఆపమని ఆదేశించాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించింది. కోర్టు తీర్పు రకుల్‌కు అనుకూలంగా వచ్చింది. అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే వరకు రకుల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కథనాలూ ప్రచురించకూడదని ఆదేశించింది. దీంతో రకుల్ తిరిగి హైదరాబాద్ వచ్చి షూటింగ్‌లో పాల్గొంటోంది. క్రిష్ డైరెక్షన్‌లో మెగా హీరో వైష్ణవ్ తేజ హీరోగా రూపొందుతున్న సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రకుల్ ప్రస్తుతం వికారాబాద్‌ వచ్చినట్టు తెలుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement