Abn logo
Mar 30 2020 @ 15:40PM

రకుల్‌కు మళ్లీ మంచి రోజులు!

Kaakateeya

`వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్‌సింగ్  టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. అయితే కొత్త భామల రాకతో రకుల్ కెరీర్ కాస్త నెమ్మదించింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసిన రకుల్‌కు గత రెండేళ్లుగా చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. అయితే ప్రస్తుతం రకుల్ మళ్లీ అవకాశాలు దక్కించుకుంటోంది. 


టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ రకుల్‌ను వరించిందట. నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఈ అమ్మడిని ఎంపిక చేశారట. అలాగే బాలీవుడ్‌లో కూడా రకుల్‌కు మంచి ఆఫర్ వచ్చిందట. బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగణ్ సరసన  నటించే అవకాశం రకుల్ దక్కించుకుందని తెలుస్తోంది.  అజయ్ హీరోగా తెరకెక్కనున్న `థ్యాంక్ గాడ్` చిత్రంలో రకుల్ నటించనుందని సమాచారం. ఈ రెండు చిత్రాలపై రకుల్ చాలా నమ్మకాలు పెట్టుకుందట. 

Advertisement
Advertisement
Advertisement