అడ్డంగా దొరికిపోయినా రకుల్, రానా పేర్లు లేకపోవడమేంటి?

ABN , First Publish Date - 2021-09-03T16:40:31+05:30 IST

త నాలుగేళ్లుగా డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. గతంలో కేసు పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. కానీ సడెన్‌గా టాలీవుడ్ ప్రమేయం ఏమీ లేదంటూ కేసును క్లోజ్ చేసిన వ్యవహారం సంచలనంగా మారింది.

అడ్డంగా దొరికిపోయినా రకుల్, రానా పేర్లు లేకపోవడమేంటి?

హైదరాబాద్: గత నాలుగేళ్లుగా డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. గతంలో కేసు పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. కానీ సడెన్‌గా టాలీవుడ్ ప్రమేయం ఏమీ లేదంటూ కేసును క్లోజ్ చేసిన వ్యవహారం సంచలనంగా మారింది. అయితే బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ మృతి తర్వాత తిరిగి ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు.. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఈడీ అరెస్ట్‌ చేసింది. రియా చక్రవర్తికి రకుల్ ప్రీత్‌సింగ్ స్నేహితురాలు కావడం గమనార్హం. డ్రగ్స్ ముఠాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియాపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై జరుగుతున్న ఈ విచారణలో భాగంగా ఇప్పటికే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, ఛార్మిలను ఈడీ ప్రశ్నించింది. నేడు రకుల్‌ను ఈడీ విచారిస్తోంది. రియా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రకుల్‌ను ఎన్‌సీబీ విచారించింది. ఎన్‌సీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.


ఎఫ్ క్లబ్ పార్టీకి రకుల్, రానా..!

ఎన్‌సీబీ తాజాగా హీరో నవదీప్ నడిపిన ఎఫ్ క్లబ్ మేనేజర్ చిట్టాలో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ పేరు కూడా ఉండటం కలకలం రేపుతోంది. క్లబ్ మేనేజర్ ఆర్థిక వ్యవహారాల్లో సైతం రకుల్ పేరు ఉంది. రకుల్ ప్రీత్‌సింగ్, నవదీప్, కెల్విన్ మధ్య వ్యవహారం దీంతో వెలుగు చూసింది. నవదీప్ ద్వారా క్లబ్ మేనేజర్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‌కు నోటీసులు అందాయి. ఎఫ్ క్లబ్ నుంచి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు నిర్ధారణ అయింది. ఎఫ్ క్లబ్ మేనేజర్‌కు డబ్బులు బదిలీచేసినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఎఫ్ క్లబ్‌లో చాలా మందికి కెల్విన్ డ్రగ్స్ సప్లయ్ చేసినట్టు ఈడీ విచారణలో తేటతెల్లమైంది. నవదీప్ ఎఫ్ క్లబ్ పార్టీకి రకుల్, రానా ఇద్దరూ హాజరయ్యారు. కానీ అడ్డంగా దొరికిపోయినా కూడా ఎక్సైజ్‌శాఖ కేసులో మాత్రం రకుల్, రానాల పేర్లు లేకపోవడం గమనార్హం. పార్టీ ఫుటేజ్, ఎన్‌సీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.


ఎప్పుడెప్పుడు ఎవరు..!?

సెప్టెంబర్-08న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ కేసును తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలోని సిట్‌ దర్యాప్తు చేస్తోంది. కోర్టులో చార్జీషీట్‌ కూడా దాఖలు చేసింది. ఈ సమయంలో ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. డ్రగ్స్‌ క్రయ విక్రయాల్లో భారీగా మనీలాండరింగ్‌ జరిగిందనే సమాచారం మేరకు ఈడీ రంగంలోకి దిగింది.

Updated Date - 2021-09-03T16:40:31+05:30 IST