Abn logo
Jul 13 2020 @ 13:16PM

వేశ్య పాత్రలో రకుల్?

టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు ప్రస్తుతం దక్షిణాది నుంచి అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ బాలీవుడ్‌పై దృష్టి సారించింది. సీనియర్ హీరోల సినిమాల్లో నటించేందుకు సిద్ధపడుతోంది. అలాగే బోల్డ్ పాత్రల్లో కనిపించేందుకు కూడా సై అంటోంది.


తాజాగా ఓ వేశ్య పాత్రలో నటించేందుకు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ ప్రముఖ వేశ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కబోతోందట. ఆ సినిమాలో రకుల్ ప్రధాన పాత్రలో కనిపించబోతోందట. బోల్డ్ రోల్ అయినప్పటికీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో రకుల్ ఓకే చెప్పిందట. 


Advertisement
Advertisement
Advertisement