Abn logo
May 22 2020 @ 16:32PM

ఆశగా ఎదురుచూస్తున్నా: రకుల్

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ అంగీకరించిన మూడు బాలీవుడ్ సినిమాలు ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రకుల్ ప్లాన్స్ అన్నీ తల్లకిందులయ్యాయి. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన రకుల్ పలు విషయాలను పంచుకుంది. 


`నేను కెరీర్ ప్రారంభించిన తర్వాత ఇన్ని రోజులు ఖాళీగా ఉండడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు సంవత్సరానికి 350 రోజులూ పనిచేశాను. ఈ ఏడాదిలో ఎన్నో పనులు చేయాలని ప్రణాళికలు వేసుకున్నాను. అయితే కరోనా కారణంగా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నా. నేను నటించిన మూడు బాలీవుడ్ సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కావాల్సి ఉంది. ఏమి జరుగుతుందో చూడాలి` అని రకుల్ పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement