ఉత్సాహంగా రక్షాబంధన్‌

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

ఉత్సాహంగా రక్షాబంధన్‌

ఉత్సాహంగా రక్షాబంధన్‌
తాండూరు : డీఎస్పీ కుమారుడికి రాఖీ కడుతున్న కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులు

తాండూరు/తాండూరు రూరల్‌/వికారాబాద్‌/దోమ, ఆగస్టు 11: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తాండూరు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులు పలు శాఖల అధికారులకు రాఖీలు కట్టారు. పట్టణంలోని డీఎస్పీ శేఖర్‌గౌడ్‌తోపాటు ఆయన కుమారుడికి, సీఐ రాజేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, తహసీల్దార్‌, ఎంఈవో, ఎంపీడీవోలకు, ఫైర్‌ అధికారులకు రాఖీలు కట్టారు. డైరెక్టర్లు ద్యావరి విష్ణువర్దన్‌రెడ్డి, సర్వోత్తంరెడ్డి, ద్యావరి జయవర్దన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే దోమ మండలం దొంగఎన్కెపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. ఉపాధ్యాయులు వీరప్ప, మల్లమ్మ, లక్ష్మన్‌ పాల్గొన్నారు. అలాగే తాండూరు పట్టణంలోని శ్రీసాయిమేథ పాఠశాలలో విద్యార్థులకు విద్యార్థినులు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. అంతారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు సర్పంచ్‌ రాములుకు రాఖీ కట్టారు. మల్కాపూర్‌లో మాజీ ఉపసర్పంచ్‌ హసన్‌పటేల్‌ జాతీయజెండాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. వికారాబాద్‌ మునిసిపల్‌లోని మహిళా కౌన్సిలర్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ కటౌట్‌కు రాఖీలు కట్టారు. అంతకుముందు మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ పథకాలు మహిళలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. కౌన్సిలర్లు పుష్పలతారెడ్డి, మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దీప భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. అలాగే తాండూరు మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ సాజిద్‌అలీకి మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి రాఖీ కట్టారు. వైస్‌ చైర్‌పర్సన్‌ దీపానర్సింహులు తన నివాసంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముస్లిం సోదరులకు రాఖీలు కట్టారు.

Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST