Raksha Bandhan: సోదరుడు తన చేతి నుండి రాఖీని ఎప్పుడు తీసివేయాలి?

ABN , First Publish Date - 2022-08-12T21:30:37+05:30 IST

అన్నా చెల్లెల మధ్య ఈ ఆనందకరమైన సమయానికి లెక్కకట్టగలమా.. ఈరోజున చెల్లెలు తన అన్నకు లేదా తమ్ముడికి రాఖీని కట్టి అతని శ్రేయస్సును కోరుకుంటుంది.

Raksha Bandhan: సోదరుడు తన చేతి నుండి రాఖీని ఎప్పుడు తీసివేయాలి?

రాఖీ పండుగ శుభ సమయాన్ని భారతదేశంలో అనేక ప్రాంతాలలో చాలా ప్రేమ అనురాగాలతో జరపుకుంటారు. అన్నా చెల్లెల మధ్య ఈ ఆనందకరమైన సమయానికి లెక్కకట్టగలమా.. ఈరోజున చెల్లెలు తన అన్నకు లేదా తమ్ముడికి రాఖీని కట్టి అతని శ్రేయస్సును కోరుకుంటుంది. అన్న చెల్లెలిని జీవితాంతం రక్షిస్తానని మాట ఇస్తాడు. 


రాఖీ అనేది హిందూ సంస్కృతిలో అందరూ జరుపుకునే వేడుక. అయితే చెల్లెలు కట్టిన రాఖీని అన్న ఎప్పుడు తీయాలి. ఇది చాలా మందికి తెలియని సంగతి. హిందూ గ్రంథాల ప్రకారం, రాఖీ కట్టడానికి నిర్దిష్ట సమయం అంటూ లేదు. వీలును బట్టి రాఖీని అన్నకు కడతారు. అయితే మహారాష్ట్ర సంస్కృతిలో రక్షా బంధన్ రోజు నుంచి 15 రోజుల పాటు సోదరుడు రాఖీని ధరించాలని చెపుతారు. పదిహేను రోజులు అయిన తరువాత మహారాష్ట్రీయులు పోలా అనే పండుగను జరుపుకుంటారు.  అదే శుభ సమయాన మరాఠీ రైతులు లార్డ్ మార్బోట్ దేవ్ ను ప్రార్థిస్తారు, అదే రోజున ఎద్దులను కూడా పూజిస్తారు. 


మన పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి తిథిలో ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగష్టు నెలలో ఈ పండుగ వచ్చింది. ఆచారం ప్రకారం కొత్త బట్టలు కట్టుకుని అన్నకు చెల్లెలు రాఖీని కట్టి అతని ఆశీర్వాదం తీసుకుంటుంది. అయితే రాఖీ కట్టడం పూర్తి అయ్యే వరకూ చెల్లెలు ఉపవాసంతో ఉంటుంది. 


కొన్ని ప్రాంతాల్లో రాఖీ రోజున థాలీని దియా అనే రుచికరమైన ఆహారాన్ని తీపి పచ్చి బియ్యం, కుంకుమ పువ్వుతో తయారు చేస్తారు. ఈ తాళిని ఆలయంలో దేవత ముందు ఉంచుతారు. అన్న నుదుటికి కుంకుమ పెట్టి రాఖీ కట్టిన తరువాత సోదరుడికి తీపిని తినిపిస్తుంది. అన్న ఇచ్చే బహుమతిని అందుకుని అతని చేతి మిఠాయి తిన్న తరువాత దియా ప్రసాదం తిని తన ఉపవాసాన్ని విరమిస్తుంది. 

Updated Date - 2022-08-12T21:30:37+05:30 IST