‘అట్రాంగి రే’ తర్వాత బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రక్షాబంధన్’. సోమవారం రక్షాంబంధన్ ఈ సందర్బంగా ‘రక్షాంబంధన్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తోబుట్టువులతో అక్షయ్ కుమార్ నవ్వుతూ కనిపిస్తున్నారు. నవంబర్ 5, 2021న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ‘‘ఈ సినిమా కథ మీ గుండెల్ని తాకుతుంది. నా కెరీర్లోనే త్వరగా సంతకం చేసిన ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది. నా సోదరీమణులు, సోదరుడిగా నటించిన వారికి ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని సోదరి అల్కాకి అంకితమిస్తున్నాను’’ అని తెలిపారు.