ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-13T04:21:13+05:30 IST

సోదరీసోదరుల ఆప్యాయతకు ప్రతీకైన రాఖీ పౌర్ణమిని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాలలో వేడుకలు అంబరాన్నంటాయి. గత రెండేళ్లు కరోనా ప్రభావం వల్ల వేడుకలకు ప్రజలు దూరంగా ఉన్నారు

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
ఖమ్మం నగరంలోని ఓ పాఠశాలలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు

మధిరటౌన్‌/ సత్తుపల్లి/ కొణిజర్ల/ వైరా/ ఏన్కూరు/ కారేపల్లి/ వేంసూరు/ ముదిగొండ/ ఖమ్మం మార్కెట్‌/ కార్పొరేషన్‌/ సాంస్కృతిక విభాగం/ చింతకాని/ పెనుబల్లి ఆగస్టు 12: సోదరీసోదరుల ఆప్యాయతకు ప్రతీకైన రాఖీ పౌర్ణమిని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాలలో వేడుకలు అంబరాన్నంటాయి. గత రెండేళ్లు కరోనా ప్రభావం వల్ల వేడుకలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఈసారి కరోనా సడలింపులు ఇవ్వడంతో జనం ఉత్సాహంగా రాఖీ పండగ జరుపుకున్నారు. దీంతో బస్టాండ్లు, స్వీట్‌ షాపులు, వివిధ దుకాణాలు రద్దీగా మారాయి. జిల్లా వ్యాప్తంగా రూ. లక్షల్లో వ్యాపారాలు జరిగాయి.

మధిరలో..

మధిరలో టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు ముఖ్యమం త్రి కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టారు, జిల్లా పరిషత్‌ చైర్మ న్‌ లింగాల కమల్‌రాజుకు పలువురు మహిళా కార్య కర్తల తో పాటు, ప్రజాప్రతినిధులు రాఖీ కట్టారు. మునిసి పల్‌ కమిషనర్‌ రమాదేవి మండల ఉన్నతాధికారులు అం దరికీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఐసీడీఎస్‌ కా ర్యాలయంలో ముగ్గులు వేశారు, వజ్రోత్సవాల్లో భాగంగా శ నివారం ఉదయం అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి వైఎస్‌ఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహి స్తామని తహసీల్దార్‌ రాం బాబు తెలిపారు.

ఎమ్మెల్యే సండ్రకు రాఖీ కట్టిన మహిళా కౌన్సిలర్లు

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు క్యాంపు కా ర్యాలయంలో మహిళా కౌన్సిలర్లు శుక్రవారం రాఖీలు క ట్టారు. అనంతరం మిఠాయిలు అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే సండ్ర రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలి పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అమరవరపు విజయ నిర్మల, నరుకుళ్ల మమత, ఎం.పద్మజ్యోతి ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు. సత్తుపల్లిలో మహిళలు ఎమ్మెల్యే సండ్ర క్యాం పు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కటౌట్‌కు రాఖీ లు కట్టారు. 

కొణిజర్లలో..

కొణిజర్ల మండలంలో శుక్రవారం రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోదరీ, సోదరీమణులు ఆప్యా యతను ప్రదర్శించారు. ఈసందర్భంగా పలు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది.

వైరాలో రాఖీ పౌర్ణమి వేడుకలు

వైరాలోని గురుకుల పాఠశాల విద్యార్థినులు ముని సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, కమిషనర్‌ ఎన్‌.వెంకటప తిరాజుకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ వేల్పుల పావని పాల్గొన్నారు.

వేంసూరులో..

వేంసూరులో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పలువురు మహిళా సర్పంచ్‌లు, మహిళలు రాఖీలు కట్టారు. కా ర్యక్రమంలో సర్పంచ్‌లు మూడ్‌ రాధ, సింగపోగు పద్మ, మందపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఎండీ.పైజుద్దీన్‌, డీసీసీబీ డైరె క్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, వెల్ది జగన్మోహన్‌రావు, ఎంపీపీ పగు ట్ల వెంకటేశ్వరరావు, కంటే వెంకటేశ్వరరావు, నాయు డు వెంకటేశ్వరరావు, ప్రసాద్‌, రావూరి శ్రీను పాల్గొన్నారు.

లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలి

లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ అన్నారు. వజ్రోత్సవా ల్లో భాగంగా శుక్రవారం కస్తూర్భా గాంధీ విద్యాలయంలో రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు. కొద్దిసేపు ఎమ్మెల్యే విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మొహమ్మద్‌షా ఖాసీం, ఎంపీడీవో అశోక్‌, పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ ఉషారాణి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి, నూకాలంపాడు సర్పంచ్‌ ఇంజం శేషగిరిరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోత్‌ సురేష్‌ నాయక్‌, లాల్‌నాయక్‌, పాఠాన్‌ మజీద్‌ఖాన్‌, చందులాల్‌ నాయక్‌, శ్రీనివాస్‌రావు, నర్సింహారావు, మైసారావు, రాజు, నాగయ్య, సత్యనారాయణ, నాగేశ్వరరావు, వీరునాయక్‌ పాల్గొన్నారు.

కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టిన కార్యకర్తలు

రాఖీపౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి శుక్రవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు రాఖీ లు కట్టారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చీరాల కృష్ణవేణి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోత్‌ సురేష్‌ నాయక్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు ధర్మారావు పాల్గొన్నారు.

కారేపల్లిలో..

కారేపల్లి మండలంలో గురువారం రాఖీపండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సోదరీమణులు రావడంతో గ్రామాల్లో పండగ వాతావ రణం ఏర్పడింది. దుకాణాలు కూడా రద్దీగా మారాయి.

తల్లాడలో...

తల్లాడ మండలంలోని మిట్టపల్లిలో వైరా ఏసీపీ ఎం ఏ.రెహ్మాన్‌, సీఐ తాటిపాముల సురేష్‌, ఎస్‌ఐ పి.సురేష్‌ ల కు బాలికలు రాఖీలు కట్టారు. అక్కాచెల్లెళ్ల రాకపోకలతో త ల్లాడ బస్టాండ్‌ రద్దీగా మారింది. రాఖీ, స్వీట్‌షాపులు కళకళలాడాయి.

చింతకానిలో..

చింతకాని మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు వారి సోదరులకు రాఖీలు కట్టి తమ అనురాగాన్ని చాటగా సోదరులు వారికి కానుకలు ఇచ్చారు. మెట్టినింటి నుంచి పుట్టింటికి రాఖీలు కట్టేందుకు మహిళలు పెద్దఎత్తున తరలిరావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ముదిగొండలో..

ముదిగొండ మండలంలో రాఖీపౌర్ణమి వేడు కలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి సోదరిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ముదిగొండలోని పలు స్వీట్‌, రాఖీ దుకాణాలు కిటకిటలాడాయి.

పెనుబల్లిలో..

పెనుబల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ ల క్కినేని అలేఖ్య, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో మహా లక్ష్మీ, సర్పంచ్‌లు దొడ్డపనేని శ్రీదేవి, కోమటి శ్రీలేఖ, భూ క్యా పంతులీ, డాక్టర్‌ శాంతారాణి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మహాలక్ష్మీతోపాటు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, టీఆర్‌ ఎస్‌ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావ్‌, కార్యద ర్శి భూక్యా ప్రసాద్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఖమ్మం నగరంలో...

ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మార్కెట్‌ ఛైర్‌పర్సన్‌ డౌలే లక్ష్మీప్ర సన్న రాఖీ కట్టారు. ఈ సందర్బంగా ఆమె మార్కెట్‌ ఉద్యో గులకు, కార్మికులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలి పారు.

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో..

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో రాఖీ వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, పు వ్వాడ అజయ్‌కుమార్‌ చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ మహిళా నేతలు రాఖీలు కట్టారు. మేయర్‌ పునుకొల్లు నీరజ కార్పొ రేటర్లతో సహా పలువురు నాయకులకు రాఖీలు కట్టారు. నగరంలోని స్మార్ట్‌ కిడ్స్‌, సర్వజ్ఞ, గీతాంజలి పాఠశాలలు, శ్రీనగర్‌ రెజోనెన్స్‌, న్యూ విజన్‌ కళాశాలల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థుల మధ్య సోదర భావాన్ని పెంపొందిం చేందుకు ఈ కార్యక్ర మం చేపట్టామని కళాశాలల బాధ్యులు తెలిపారు.


Updated Date - 2022-08-13T04:21:13+05:30 IST