ఆర్టీసీకీ రాఖీ బొనాంజా

ABN , First Publish Date - 2022-08-14T06:03:08+05:30 IST

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారీగా ఆదాయం సమకూరింది.

ఆర్టీసీకీ రాఖీ బొనాంజా

- రీజియన్‌ వ్యాప్తంగా రూ. 2.38 కోట్ల ఆదాయం

భగత్‌నగర్‌, ఆగస్టు 13: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారీగా ఆదాయం సమకూరింది. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా ఉన్న పదకొండు డిపోల్లో ఆర్టీసీకి 2,28,19,034 రూపాయల ఆదాయం సమకూరింది. . కరీంనగర్‌ రీజియన్‌లో పదకొండు డిపోల్లో  3,92,638 కిలో మీటర్ల మేర బస్సులను తిప్పి 92.82 శాతం అక్యుపెన్సి రెషియోతో అత్యధికంగా 2,28,19,034 రూపాయల ఆదాయాన్ని రాబట్టుకుంది. తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు జోన్లు గ్రేటర్‌ హైదరాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్లు ఉన్నాయి. కరీంనగర్‌ జోన్‌లో పదకొండు రీజియన్‌లలో ఆక్యుపెన్సి రేషియోలో కరీంనగర్‌ రీజియన్‌  ప్రథమ స్థానంలో నిలిచింది.  రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్‌ రీజియన్‌ ఆక్యుపెన్సి రేషియోలో రెండో స్థానం సాధించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు కరీంనగర్‌ రీజియన్‌కు ఆదాయంలో  1.59.15 రూపాయల టార్గెట్‌ విధించగా 2.28 కోట్ల రూపాయల అత్యధిక ఆదాయాన్ని రాబట్టుకుంది. 

- కరీంనగర్‌ రీజియన్‌ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అత్యధిక ఆదాయం సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లను కరీంనగర్‌ రీజినల్‌ మేనేజర్‌ ఖుస్రోషాఖాన్‌ అభినందించారు. రానున్న కాలంలో సంస్థ అభివృద్ధి కోసం సిబ్బంది కృత నిశ్చయమంతో, అంకితభావంతో పని చేయాలని, సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాడలని కోరారు. ఆర్టీసీని ఆదరించి రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అత్యధిక ఆదాయం అందించడంలో సహకరించిన ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2022-08-14T06:03:08+05:30 IST