ఇంటింటా రాఖీ పండుగ సందడి

ABN , First Publish Date - 2020-08-04T10:20:46+05:30 IST

అక్కాచెల్లెలు, అన్నతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగ సోమవారం ఇంటింటా జరుపుకున్నారు.

ఇంటింటా రాఖీ పండుగ సందడి

నస్పూర్‌. ఆగస్టు 3: అక్కాచెల్లెలు, అన్నతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగ సోమవారం ఇంటింటా జరుపుకున్నారు. కరోనా కారణంగా దూర ప్రాంతాల్లో ఉన్న సోదరీమణులు కొరియర్‌, పోస్టు ద్వారా రాఖీలను పంపారు. సెల్‌ఫోన్‌లో వీడియో కాల్స్‌ ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ ఏడాదిలో రాఖీలు, స్వీట్ల అమ్మకాలు తగ్గిపోయాయి. ప్ర యాణికుల రాకపోకలతో ఆర్టీసీ, ఆటోలు కిక్కిరిసి పోయేవి. కానీ ఈ యేడు సాదాసీదాగా పండుగ వేడుకలు జరిగాయి. 


దండేపల్లి:  రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా  నేపథ్యంలో రాఖీలు కట్టి క్షేమంగా ఉండాలని మాస్కులతోపాటు శానిటైజర్లు అందజేశారు. స్వామి వివేకానంద సేవ సంస్ధ మండల శాఖ అధ్యక్షులు  మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో మ్యాదరిపేటలో పలువురికి రాఖీలు కట్టారు. 


మందమర్రిటౌన్‌: రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.  దూర ప్రాం తాల్లో ఉన్న అక్కాచెల్లెల్లు సోదరుల ఇంటికి వచ్చి రాఖీలు కట్టారు. కరోనా వైరస్‌ వల్ల దూర ప్రాంతాల నుంచి చాలా మంది బైక్‌లు, కార్లలో  వచ్చారు. పలు స్వీటు షాపుల ఎదుట ప్రజలు బారులు తీరి స్వీట్లు కొనుగోలు చేశారు.

 

లక్షెట్టిపేట : లక్షెట్టిపేటలో రాఖీపౌర్ణమి వేడుకలను ప్రజలు నిరాడంబరంగా జరుపుకున్నారు.  ఎలాంటి హడావుడి లేకుండా తమ తమ సోదరులకు, పెద్దలకు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 


మందమర్రిరూరల్‌ : గ్రామాల్లో రక్షాబంధన్‌ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. అక్కాచెల్లెల్లు సోదరులకు రాఖీలు కట్టి క్షేమంగా ఉం డాలని ఆశీర్వదించారు. 


చెన్నూర్‌: రాఖీ పౌర్ణమిని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అక్కా చెల్లెల్లు అన్నతమ్ముళ్లకు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలిపారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనరాంలాల్‌గిల్డా వైస్‌ చైర్మన్‌ నవాజొద్దీన్‌ కు రాఖీ కట్టారు.


శ్రీరాంపూర్‌: రాఖీ పండుగను శ్రీరాంపూర్‌ ఏరియాలో ఘనంగా జరుపుకు న్నారు. ప్రతీ ఇంట్లో ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టి  అనుబం ధాన్ని చాటుకున్నారు.  


కోటపల్లి:  కోటపల్లిలో ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌కు ఆయన సోదరీమణులు, గ్రామానికి చెందిన  పలువురు మహిళలు రాఖీలు కట్టారు. 


జన్నారం: అన్నా, తమ్ముళ్ళకు రాఖీలు కట్టేందుకు సుదూరంలో ఉన్న అక్కా చెల్లెళ్ళు పుట్టింటికి చేరుకొని  అనురాగాలను పంచుకున్నారు. జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌కు ఎంపీపీ మాదాడి సరోజన రాఖీ కట్టారు. ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాం నాయక్‌ మండలంలో ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికిహాజరుకాగా పలువురు రాఖీలు కట్టారు.


జైపూర్‌: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో రాఖీ పౌర్ణమి వేడుక లను ఘనంగా జరుపుకున్నారు.  


భీమారం: రక్షాబంధన్‌ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అ న్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌ కావడంతో అక్కాచెల్లెల్లు అన్నద మ్ములకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. 


బెల్లంపల్లి టౌన్‌: బెల్లంపల్లి పట్టణానికి చెందిన తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దంశెట్టి సాజన్‌కు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌ లో రాఖీ కట్టారు. 


రామకృష్ణాపూర్‌: రామకృష్ణాపూర్‌ ఏరియాలో రాఖీపౌర్ణమి పండుగను ప్రజ లు ఘనంగా జరుపుకున్నారు. రాఖీలు కట్టి ఆనందంగా గడిపారు. 


వేమనపల్లి : రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.  అక్కాచెల్లెల్లు  సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు.  


మంచిర్యాల టౌన్‌: మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్యకు ఆయన సోదరి రాఖీ కట్టారు. కౌన్సిలర్‌ నల్ల శంకర్‌కు కౌన్సిలర్‌ పూదరి సునీత ప్రభాకర్‌, మాజీ కౌన్సిలర్లురమాదేవి, అంకం సంజీతలు రాఖీ కట్టారు.  

Updated Date - 2020-08-04T10:20:46+05:30 IST