Rakhi festival: అనుబంధాల రాఖీ

ABN , First Publish Date - 2022-08-04T16:53:27+05:30 IST

అన్నాచెల్లల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ (Rakhi festival)ను నిర్వహించుకుంటాం.

Rakhi festival: అనుబంధాల రాఖీ

హైదరాబాద్: అన్నాచెల్లల అనుబంధానికి  ప్రతీకగా రాఖీ పండుగ (Rakhi festival)ను నిర్వహించుకుంటాం. పండుగకు వారం రోజుల ముందే ప్రధాన వీధులు, కిరాణం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాపులలో వివిధ రకాల రాఖీల విక్రయిస్తుంటారు. నగరంలో వందలాది దుకాణాలు ప్రధాన రహదారులకు ఇరువైపులా వెలిశాయి. రాఖీల కోనుగోలుకు మహిళలు ఆయా ప్రాంతాలకు  వస్తున్నారు. ఢిల్లీ (Delhi), రాజ్‌కోట్‌, జైపూర్‌ తదితర ప్రాంతాలనుంచి రాఖీలను కొని స్థానికంగా విక్రయిస్తున్నారు. విదేశాల్లోని సోదరుల కొరియర్‌ (Courier) ద్వారా ఇప్పటికే పలు రకాలైన రాఖీలను మహిళలు పంపిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా వివిధ రకాలైన ప్రత్యేక రాఖీలను మార్కెట్‌లలో అభ్యమవుతున్నాయి. సింగల్‌ ఫీస్‌ రాఖీ, ఫ్యాన్సీ, మెటల్‌, స్పాంజ్‌ , చెందన్‌, వెండి తదితర రాఖీలు ఢిల్లీ, పంజాబ్‌  నుండి దిగుమతి అవుతున్నాయి. చిన్నారుల కోసం కుడా ప్రత్యేక రాఖీలను వ్యాపారులు విక్రయిస్తున్నారు. మహిళలు ఉదయం, సాయంత్రం వేళల్లో షాపుల్లో కొనడంతో  రాఖీ విక్రయకేంద్రాలు సందడిగా మారాయి.

Updated Date - 2022-08-04T16:53:27+05:30 IST