Abn logo
Sep 26 2021 @ 15:03PM

ఈ షేర్లు కొనండి... రాకేశ్ ఝన్‌ఝన్ వాలా

ముంబై : ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్ఝన్ వాలా... తన పెట్టుబడులు.. షేర్లపై అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. గత పదిహేను నెలల్లో టాటా మోటార్స్ తనకున్న అతిపెద్ద పెట్టుబడి అని వెల్లడించాడు. అంతేకాదు... గమింగ్ అండ్ న్యూ ఏజ్ డిజిటల్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. 


టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించడం స్టాక్‌ను మరింత పెంచుతుందని రాకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన జీవితంలో అతిపెద్ద పెట్టుబడులలో ఇది ఒకటిగా మారడానికి అది కూడా ఓ కారణమన్నారు. టాటా మోటార్స్ భారతదేశంలోనే కాకుండా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌కు సారధ్యం వహించబోతోంది. ఈ షేర్లు తీసుకుంటే మంచి లాభాలొస్తాయని సూచించారు.