రాజ్యసభ ఎన్నికల వ్యవహారం.. ఆ ఆరుగురి నామినేషన్లు సక్రమమే

ABN , First Publish Date - 2022-06-02T14:13:23+05:30 IST

రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ప్రధాన రాజకీయ పార్టీల తరఫున దాఖలైన ఆరుగురి నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల నిర్వహణాధికారి,

రాజ్యసభ ఎన్నికల వ్యవహారం.. ఆ ఆరుగురి నామినేషన్లు సక్రమమే

                                  - ఏడు తిరస్కరణ


చెన్నై, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ప్రధాన రాజకీయ పార్టీల తరఫున దాఖలైన ఆరుగురి నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల నిర్వహణాధికారి, శాసనసభ కార్యదర్శి శ్రీనివాసన్‌ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే తరఫున కల్యాణసుందరం, రాజేష్ కుమార్‌, గిరిరాజన్‌, కాంగ్రెస్‌ తరఫున కేంద్ర మాజీమంత్రి పి. చిదంబరం, అన్నాడీఎంకే తరఫున సీవీ షణ్ముగం, ధర్మర్‌ నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. వీరితోపాటు మేట్టూరు పద్మరాజన్‌ సహా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల పరిశీలన బుధవారం జరిగింది. ఏడుగురు స్వతంత్రుల నామినేషన్లపై పదిమంది శాసనసభ్యుల ప్రతిపాదిత సంతకాలు లేకపోవడంతో వాటిని తిరస్కరించినట్లు శ్రీనివాసన్‌ తెలిపారు. దీంతో ప్రస్తుతం పోటీలో మిగిలిన ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయమెంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల కమిషన్‌ నుంచి అధికారిక ప్రకటన విడుదల కానుంది. 

Updated Date - 2022-06-02T14:13:23+05:30 IST