ఆ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

ABN , First Publish Date - 2022-05-18T08:25:19+05:30 IST

సొంత ఆడిటరు.. వ్యక్తిగత లాయరు.. టీడీపీ మాజీ నేత.. మరో మాజీ టీడీపీ నేత! మొత్తం నలుగురు..

ఆ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

అటూ ఇటూ ‘మనోళ్లే’

తెలంగాణ నుంచి ఇద్దరు.. నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు

బీసీ ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య, నిరంజన్‌ రెడ్డి, 

బీద మస్తాన్‌రావుకు చాన్స్‌.. సాయిరెడ్డికి మరోసారి

ఇద్దరు బీసీలు.. ఇద్దరిది సొంత సామాజికవర్గం

కృష్ణయ్య, నిరంజన్‌... ఇద్దరిదీ తెలంగాణ

జగన్‌ వ్యక్తిగత లాయర్‌గా నిరంజన్‌ సేవలు

బీద, కృష్ణయ్య ఇద్దరూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలే


(అమరావతి - ఆంధ్రజ్యోతి): సొంత ఆడిటరు.. వ్యక్తిగత లాయరు.. టీడీపీ మాజీ నేత.. మరో మాజీ టీడీపీ నేత! మొత్తం నలుగురు.. ఇద్దరిది తెలంగాణ.. ఇద్దరిది ఏపీ.. ఎట్టకేలకు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు! 


మంగళవారం కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని రాగానే... ముఖ్యమంత్రి జగన్‌ వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. ప్రముఖ బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌ రావు, ఏలేటి నిరంజన్‌ రెడ్డిలకు రాజ్యసభ చాన్స్‌ ఇచ్చారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డిని మరోసారి పెద్దల సభలో కొనసాగించాలని నిర్ణయించారు. నలుగురిలో 



ఇద్దరు బీసీలు కాగా... మిగిలిన ఇద్దరు జగన్‌ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు. ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావు ఇద్దరూ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే కావడం విశేషం. 2014లో ఆర్‌.కృష్ణయ్య ఎల్‌బీనగర్‌ నుంచి తెలంగాణ శాసన సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయనను చంద్రబాబు నాయుడు ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’గా కూడా ప్రకటించారు. ఇక... బీద మస్తాన్‌ రావు కావలి నుంచి 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. 


‘టీ’ నుంచి ఢిల్లీ... వయా ఏపీ

వైసీపీ ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు అచ్చంగా తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. ఆర్‌.కృష్ణయ్యది వికారాబాద్‌ జిల్లా. మోమిన్‌పేట మండలం రాళ్లగుడుపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. బీసీ ఉద్యమ నాయకుడు. ఇక... ఏలేటి నిరంజన్‌ రెడ్డి నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌  మండలం సిర్గాపూర్‌లో జన్మించారు. 1992లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న నేతలు, వైసీపీలోనూ బీసీ వర్గానికి చెందిన నాయకులు అనేక మంది ఉన్నప్పటికీ... తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఇక్కడ ఎంతో మంది ఉండగాపొరుగు రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవడం ఎందుకు?’ అని ఇక్కడి బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిరసన స్వరాలూ వినిపిస్తున్నాయి. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్‌ వెన్నంటి నడిచిన బలహీన వర్గాల నేతలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నిస్తున్నారు. 


అలీకి ప్రస్తుతానికి నిరాశ

‘తీపి కబురు’ కోసం ఎదురు చూస్తున్న సినీ నటుడు అలీకి మరోసారి నిరాశ ఎదురైంది. రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఇటీవల తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ను అలీ కుటుంబ సభ్యులతో సహా కలిశారు. త్వరలోనే వైసీపీ కార్యాలయం నుంచి తీపి కబురు వస్తుందని సీఎం చెప్పారని అలీ వెల్లడించారు. దీంతో... ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఖాయమైనట్లేనని అంతా భావించారు. కానీ... అలీకి ఆ అవకాశం దక్కలేదు. మైనారిటీ వర్గానికి చెందిన వారెవరికీ చాన్స్‌ లభించలేదు. అలాగే... నాలుగు స్థానాల్లో ఒకటి మహిళలకు కేటాయిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. నామినేటెడ్‌, ఇతర పదవుల్లో 50 శాతం మహిళలకే ఇస్తామని జగన్‌ గతంలో గొప్పగా చెప్పారు. మాజీ మంత్రి కిల్లి కృపారాణికి రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందంటూ వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గానికి చెందిన ఆమెకు పదవి దక్కుతుందని ఆ ప్రాంతానికి చెందిన వారు ఆనందించారు. కానీ... ఈసారి మహిళలందరికీ జగన్‌ ‘సారీ’ చెప్పేశారు.


బీసీలకు సముచిత స్థానం: మంత్రి బొత్స 

బీసీలకు సముచిత స్థానం ఇస్తూ వారిలో ఉన్న రాజకీయ పటిమకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అభ్యర్థుల ఖరారుపై సీఎం నిర్వహించిన భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలోనూ ఇద్దరు బీసీలు పిల్లి సుభా్‌షచంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావుకు రాజ్యసభ అవకాశం కల్పించాం. ఇప్పుడు మరో ఇద్దరు బీసీలను ఎంపిక చేశాం. ఇలా ఎప్పుడూ జరగలేదు. బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా  జగన్మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని తెలిపారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అనే ప్రస్తావన రాదని... బీసీలకు అవకాశం ఇస్తుండటమే ముఖ్యమని బొత్స అన్నారు. ఆర్‌.కృష్ణయ్య జాతీయ నాయకుడని తెలిపారు. ఇక... నిరంజన్‌ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్‌ లాయరని 

బొత్స వివరించారు.


బీసీలకు ప్రాధాన్యం:సజ్జల

బీసీలను పార్టీ అధికారంలోనికి వచ్చిన నాటి నుంచి బ్యాక్‌ బోన్‌లుగానే చూస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే ఏకైక పార్టీ వైసీపీయేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు  కూడా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.


బీసీలకు సముచిత స్థానం: మంత్రి బొత్స 

బీసీలకు సముచిత స్థానం ఇస్తూ వారిలో ఉన్న రాజకీయ పటిమకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అభ్యర్థుల ఖరారుపై సీఎం నిర్వహించిన భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలోనూ ఇద్దరు బీసీలు పిల్లి సుభా్‌షచంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావుకు రాజ్యసభ అవకాశం కల్పించాం. ఇప్పుడు మరో ఇద్దరు బీసీలను ఎంపిక చేశాం. ఇలా ఎప్పుడూ జరగలేదు. బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా  జగన్మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని తెలిపారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర అనే ప్రస్తావన రాదని... బీసీలకు అవకాశం ఇస్తుండటమే ముఖ్యమని బొత్స అన్నారు. ఆర్‌.కృష్ణయ్య జాతీయ నాయకుడని తెలిపారు. ఇక... నిరంజన్‌ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్‌ లాయరని బొత్స వివరించారు.


బీసీలకు ప్రాధాన్యం:సజ్జల

బీసీలను పార్టీ అధికారంలోనికి వచ్చిన నాటి నుంచి బ్యాక్‌ బోన్‌లుగానే చూస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే ఏకైక పార్టీ వైసీపీయేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు  కూడా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.


నన్ను ఏ పార్టీ గుర్తించలేదు : ఆర్‌.కృష్ణయ్య

రాజ్యసభకు ఎంపిక చేసినందుకు సీఎం జగన్మోహన్‌ రెడ్డికి ఆర్‌.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ‘‘దాదాపు 47 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కోసం పోరాడుతున్నాను. నన్ను  ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా అవకాశం ఇవ్వడానికి భయపడ్డారు. కానీ... నా సేవ, నిబద్ధత, అంకితభావాన్ని  జగ న్‌ గుర్తించారు’’ అని తెలిపారు. తాను తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు జాతీయస్థాయిలో బీసీ ల కోసం పోరాడానని అన్నారు. తన అభ్యర్థిత్వా న్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఆర్‌.కృష్ణయ్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన అనంతరం... హైదరాబాద్‌ విద్యానగర్‌లోని బీసీ భవన్‌ వద్ద భారీగా సంబరాలు జరుపుకొన్నారు.


తన వారు ఇద్దరికి... 

తెలంగాణకు చెందిన నిరంజన్‌ రెడ్డి సీఎం జగన్‌కు వ్యక్తిగత న్యాయవాది. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులను ఆయన వాదిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏపీలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గా నియమించారు. లక్షలకు లక్షలు ఫీజులు కూడా చెల్లించారు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ చిత్ర నిర్మాతల్లో నిరంజన్‌ రెడ్డి కూడా ఒకరు! ఇక... విజయసాయి రెడ్డి జగన్‌ కుటుంబ కంపెనీల ఆడిటర్‌గా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు! వచ్చేనెలలో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు.. జగన్‌ ఆయనకు మరో అవకాశమిచ్చారు. ఇప్పుడు ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థుల్లో... బీద మస్తాన్‌ రావు, విజయ సాయిరెడ్డి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. 

Updated Date - 2022-05-18T08:25:19+05:30 IST