పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతంలో రాజ్యసభ కీలకం : ఉపరాష్ట్రపతి వెంకయ్య

ABN , First Publish Date - 2022-04-04T08:58:24+05:30 IST

పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతంలో రాజ్యసభ కీలకం : ఉపరాష్ట్రపతి వెంకయ్య

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3: పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆదివారం రాజ్యసభ దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ రాజ్యసభ దినోత్సవ శుభాకాంక్షలు. సభ్యులందరూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సభలో నిర్మాణాత్మక చర్చల్ని జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఉపరాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. రాజ్యసభ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. 1946, డిసెంబరు 9న తొలిసారిగా సమావేశమైన రాజ్యాంగ అసెంబ్లీ, 1950 వరకూ కేంద్ర శాసనసభగా, అనంతరం తాత్కాలిక పార్లమెంటుగా రూపాంతరం చెందింది. 1952లో తొలి ఎన్నికలు జరిగే వరకూ ఇది ఒకే సభగా ఉంది. చర్చోపచర్చల అనంతరం.. భారత్‌కు రెండు సభలు అవసరమేనని అన్ని పక్షాలూ అంగీకరించడంతో రాష్ట్రాల మండలి(కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌) పేరిట రాజ్యసభ ఏర్పాటైంది. 

Updated Date - 2022-04-04T08:58:24+05:30 IST