సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థి బీదమస్తాన్

ABN , First Publish Date - 2022-05-19T17:45:59+05:30 IST

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్ధి బీద‌మ‌స్తాన్ రావు గురువారం ఉదయం మ‌ర్య‌దపూర్వ‌కంగా క‌లిశారు.

సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థి బీదమస్తాన్

అమ‌రావ‌తి: ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని  వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్ధి బీద‌మ‌స్తాన్ రావు గురువారం ఉదయం మ‌ర్య‌ాదపూర్వ‌కంగా క‌లిశారు. ఈ సందర్భంగా బీదమస్తాన్ మీడియాతో మాట్లాడుతూ... 100 కోట్లు ఇచ్చి రాజ్య‌సభ తీసుకున్న‌ాను అన‌డంలో వాస్త‌వం లేదని స్పష్టం చేశారు. ఎన్నికోట్లు ఇచ్చార‌ని ఆర్ కృష్ణ‌య్య‌కు రాజ్య‌స‌భ ఇచ్చారని ప్రశ్నించారు. ఆర్ కృష్ణ‌య్య‌ను తెలంగాణ నేత‌గా చూడ‌కూడ‌దని,  ఆయ‌న జాతీయ‌స్ధాయి బీసీ నేత‌ అని తెలిపారు. బీసీల‌ను అడ్డుపెట్టి ఇద్ద‌రు రెడ్డిల‌కు రాజ్య‌స‌భ ఇచ్చ‌ార‌న‌డం క‌రెక్టు కాదన్నారు. ‘‘విజ‌య‌సాయిరెడ్డిని మీరు రెడ్డిగా ఎలా చూస్తారు. ఆయ‌న ఆది నుండి జ‌గ‌న్, వైఎస్ఆర్ వెంట ఉన్నారు’’ అని అన్నారు. నిరంజ‌న్ రెడ్డి విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై సుప్రీంకోర్టులో రాష్ట్రం త‌ర‌పున పోరాటం చేస్తున్నారని తెలిపారు. త‌న‌కు రాజ్య‌స‌భ అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించినందుకు ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. అన్న ఓ పార్టీ త‌మ్ముడు మ‌రో పార్టీలో ఉండ‌కూడ‌దా అని ప్రశ్నించారు. అయినా ర‌విచంద్ర తన సొంత త‌మ్ముడు కాదని  బీదమస్తాన్  చెప్పారు. 


Updated Date - 2022-05-19T17:45:59+05:30 IST