వియత్నాం పర్యటనకు Rajnath Singh.. రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-06-06T01:09:19+05:30 IST

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 8న వియత్నాం వెళ్లనున్నారు. ఈ

వియత్నాం పర్యటనకు Rajnath Singh.. రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యం

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 8న వియత్నాం వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫన్ వాన్ గియాంగ్‌తో రక్షణ పరమైన సహాకారంపై చర్చలు జరుపుతారు. ఈ మేరకు రక్షణశాఖ తెలిపింది. ఈ సందర్భంగా హాయి ఫాంగ్‌లోని హాంగ్ హా యార్డ్‌లో వియత్నాంకు 12 హైస్పీడ్ బోట్లను అందజేసే కార్యక్రమానికి రాజ్‌నాథ్ అధ్యక్షత వహిస్తారు. 100 మిలియన్ డాలర్ల రక్షణ శ్రేణి కింద  ఎల్ అండ్ టీ (L&T) ఈ బోట్లను నిర్మించింది. 


వియత్నాంతో రక్షణ పరిశ్రమ సహకారం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైనదని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ది వరల్డ్' వంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌ను ఇది ఉదహరిస్తుందని తెలిపింది. వియత్నాం మాజీ అధ్యక్షుడు హోచి మిన్‌కు హనోయిలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించడంతో సింగ్ వియత్నాం పర్యటన ప్రారంభమవుతుంది.

Updated Date - 2022-06-06T01:09:19+05:30 IST