సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడ్డాం : రాజ్‌నాథ్

ABN , First Publish Date - 2020-07-09T21:19:20+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన ఆరు బ్రిడ్డిలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం

సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడ్డాం : రాజ్‌నాథ్

శ్రీనగర్ :జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన ఆరు బ్రిడ్డిలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ నరవాణే, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిమోట్ ఏరియాలను అభివృద్ధి పథంవైపు తీసుకెళ్లడమే ఎన్డీయే సర్కార్ లక్ష్యమని ఆయన ప్రకటించారు.


ఈ ఆరు బ్రిడ్జిలను నిర్మించడానికి 43 కోట్లు ఖర్చయ్యాయని అక్నూర్ - పల్లన్‌వాలా దగ్గర నాలుగు బ్రిడ్జిలు, తార్నానల్లా- కథువా దగ్గర రెండు బ్రిడ్జిలు నిర్మించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసమైనవన్నీ కల్పించడానికి తాము సదా సిద్ధమేనని రాజ్‌నాథ్ ప్రకటించారు.


‘‘జమ్మూ కశ్మీర్ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. జమ్మూ కశ్మీర్ ప్రజల, భద్రతా దళాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైప్‌లైన్ నిర్మాణానికి కూడా సిద్ధమే. జమ్మూ ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది’’ అని రాజ్‌నాథ్ తెలిపారు. 

Updated Date - 2020-07-09T21:19:20+05:30 IST