రాజ్‌నాథ్ ను రంగంలోకి దింపిన కేంద్రం

ABN , First Publish Date - 2020-09-20T15:06:35+05:30 IST

వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్రం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది.

రాజ్‌నాథ్ ను రంగంలోకి దింపిన కేంద్రం

న్యూఢిల్లీ : వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్రం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. రాజ్యసభలో బీజేపీకి సొంత బలం లేకపోవడంతో బీజేపీ వ్యూహ బృందం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ను రంగంలోకి దింపింది. ప్రాంతీయ పార్టీలు, మిత్ర పక్షాలను ఎలాగైనా ఒప్పించి, మద్దతు పలికేలా చూడాలన్న బాధ్యతను రాజ్‌నాథ్ భుజాలపై పెట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టారు.


శివసేన, ఎన్సీపీతో పాటు మరిన్ని పార్టీల బాధ్యలకు రాజ్‌నాథ్ ఫోన్ చేశారు. బిల్లుల ఆవశ్యకత, ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ... బిల్లులకు మద్దతివ్వాలని కోరారు. ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో లోకసభలో సునాయాసంగా గట్టెక్కింది. అయితే రాజ్యసభలో మాత్రం ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. అధికార పార్టీ బిల్లులను ఆమోదించుకోవాలని గట్టి పట్టుదలతో ఉండగా... వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలను చేస్తోంది. కాంగ్రెస్ మోకాలడ్డుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహ బృందం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను రంగంలోకి దింపింది. 

Updated Date - 2020-09-20T15:06:35+05:30 IST