Abn logo
Oct 25 2020 @ 07:26AM

ఓట్ల కోసం వచ్చిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్తులు

Kaakateeya

మధుబని: బీహార్‌లోని మధుబని జిల్లాలోని రాజ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యేకు ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. ఒక గ్రామానికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తుండగా, గ్రామస్తులు అతనిని అడ్డుకున్నారు. ఆ ఎమ్మెల్యేను అసభ్య పదజాలంతో దూషిస్తూ, గ్రామం నుంచి తరిమికొట్టారు.

సదరు ఎమ్మేల్యే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టలేదని, ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే రాజ్‌నగర్ అసెంబ్లీ సీటు నుంచి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌ప్రీత్ పాశ్వాన్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మల్యే తన మద్దతుదారులతో పాటు మహరైల్ గ్రామానికి చేరుకున్నారు. అతను రాగానే గ్రామానికి చెందిన యువకులు అడ్డుకున్నారు. గ్రామంలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు. అయినప్పటికీ ఎమ్మెల్యే గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు ఎమ్మెల్యే మాటలను వినకుండా, అసభ్య పదజాలం ప్రయోగిస్తూ, ఎమ్మెల్యేను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఇకఎప్పుడు గ్రామంలోకి ప్రచారం పేరుతో వచ్చినా ఇలాగే తరిమికొడతామని ఎమ్మెల్యేను హెచ్చరించారు. 


Advertisement
Advertisement