Abn logo
Mar 30 2020 @ 06:18AM

బాధితులకు అండగా మరో హీరో

కరోనా వైరస్ బారిన పడిన వారికి సహాయం చేయడానికి బాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు తారలు ముందుకు వస్తున్నారు. నటుడు అక్షయ్ కుమార్ పిఎం కేర్ రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం ఇచ్చిన తరువాత చాలా మంది ఆర్టిస్టులు తమ పేర్లను ఈ జాబితాలో నమోదు చేసుకుంటున్నారు. కొత్తగా నటుడు రాజ్‌కుమార్ రావు తన విరాళం ప్రకటించాడు. ఫలితంగా సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాక్టర్ తాను అందించే విరాళం విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. "కరోనా వైరస్ కు  వ్యతిరేకంగా నిలబడి, దానిని ఎదుర్కోవలసిన సమయం ఇది. నా తరపున కొంత సాయం అందిస్తున్నాను. నిరుపేద కుటుంబాలకు అవసరమైన వస్తువులను అందించడానికి నా తరపున పిఎం రిలీఫ్ ఫండ్ కు నగదు అందించాను. దయచేసి అందరూ ఏదో ఒక విధమైన  సహాయం చేయండి. మన దేశం మనకు కావాలి. జై హింద్" అని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement