రాజీవ్‌ స్వగృహ ప్లాట్లు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-01-28T06:19:32+05:30 IST

రాజీవ్‌ స్వగృ హ శ్రీవల్లి టౌనషిప్‌లో ఓపెన స్థలాన్ని ప్లాటింగ్‌ చేసి నంబరింగ్‌ వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత జీవనపా టిల్‌ అధికారులను ఆదేశించారు.

రాజీవ్‌ స్వగృహ ప్లాట్లు సిద్ధం చేయాలి
రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లీ టౌనషి్‌పను సందర్శించి సూచనలు చేస్తున్న కలెక్టర్‌ పాటిల్‌

కలెక్టర్‌ ప్రశాంత జీవన పాటిల్‌ 

నార్కట్‌పల్లి/ నల్లగొండ టౌన, జనవరి 27: రాజీవ్‌ స్వగృ హ శ్రీవల్లి టౌనషిప్‌లో ఓపెన స్థలాన్ని ప్లాటింగ్‌ చేసి నంబరింగ్‌ వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత జీవనపా టిల్‌ అధికారులను ఆదేశించారు. నార్కట్‌పల్లి మండలంలోని దాసరిగూడేనికి వెళ్లేదారిలో ఉన్న రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లీ టౌనషిప్‌ను హెచఎండీఏ ఆధ్వర్యంలో ఆక్షన ద్వారా విక్రయించేందుకు ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఓపెన ప్లాట్ల హద్దురాళ్ల ఏర్పా ట్లను కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. ఓపెన ప్లాట్‌ ఏరియాను చదునుగా చేసి ప్లాట్ల హద్దురాళ్లను నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 833 ప్లాట్లకు 259ప్లాట్లలో వివిధ కేటగిరీల్లో గృహ నిర్మాణాలు చేపట్టగా, మిగితా 574ప్లాట్లకు నంబరింగ్‌ వేయాలని సూచించారు. వారం రోజుల్లో పనులు పూర్తిచేసి విక్రయానికి సి ద్ధం చేయాలని ఆదేశించారు. టౌనషి్‌ప నుంచి గ్రామానికి అనుసంధానమయ్యేలా రహదారులు ఏర్పాటు చేయాలని సూచించారు. టౌనషి్‌పలో సైట్‌ కార్యాలయం ప్రారంభిస్తామని ప్రభుత్వాదేశాల ప్రకారం హెచఎండీఏ ద్వారా ధర నిర్ణయించి పారదర్శకంగా ఈ ఆక్షన చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్‌ ఈఈ తిరుపతయ్య, డీఈ నాగయ్య, ఏడీ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాస్‌, తహసీల్దా ర్‌ పల్నాటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు. 

ఇరిగేషన కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోవాలి 

నల్లగొండ టౌన: జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ వద్ద ఉన్న ఇరిగేషనశాఖ ఈఈ, ఏఈల కార్యాలయాలను పాత జిల్లా పరిషత కార్యాలయంలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రశాంత జీవనపాటిల్‌ ఆదేశించారు. కలెక్టర్‌ పాత జడ్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. పాత జడ్పీ కార్యాలయం పక్క న ఉన్న గదుల్లో ఇరిగేషన ఈఈ కార్యాలయం తరలించేందుకు అ వసరమైన  ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ తో పాటు ఇరిగేషన ఈఈ సత్యనారాయణ, డీఈ భిక్షపతి, పంచాయతీరాజ్‌ ఈఈ తిరుపతయ్య, డీఈ నాగయ్య ఉన్నారు. 


Updated Date - 2022-01-28T06:19:32+05:30 IST