కొత్త CEC గా Rajiv Kumar బాధ్యతలు

ABN , First Publish Date - 2022-05-15T19:35:18+05:30 IST

భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC)గా Rajiv Kumar ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు

కొత్త CEC గా Rajiv Kumar బాధ్యతలు

న్యూఢిల్లీ: భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC)గా Rajiv Kumar ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకూ సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర (Sushil chandra) తన పదవీ కాలం ముగియడంతో శనివారంనాడు పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సీనియర్ మోస్ట్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీఈసీగా కేంద్రం ఈ నెల 12న నియమించింది. ఆయన నియామకం 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాబోయే లోక్‌సభ, రాష్ట్రపతి ఎన్నికలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.


కాగా, 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ 2020 సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. గత ఫిబ్రవరిలో ఆయన ఆర్థిక కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. ప్రభుత్వంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేశారు. అప్పటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా స్థానంలో ఈసీగా కుమార్ పనిచేశారు.

Updated Date - 2022-05-15T19:35:18+05:30 IST