విక్రయానికి రాజీవ్‌ స్వగృహ ఇళ్లు

ABN , First Publish Date - 2022-01-28T05:10:10+05:30 IST

విక్రయానికి రాజీవ్‌ స్వగృహ ఇళ్లు

విక్రయానికి రాజీవ్‌ స్వగృహ ఇళ్లు
తాండూరులోని రాజీవ్‌ స్వగృహ ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిఖిల

  • సందర్శించిన వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల 
  • ఈ-వేలం ద్వారా అమ్మకానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశం
  • ఆసక్తి ఉన్న వారు వెబ్‌సైట్‌లో పేర్ల నమోదుకు అవకాశం

తాండూరు, పెద్దేముల్‌, జనవరి 27: తాండూరు-హైదరాబాద్‌ రోడ్డులోని రాజీవ్‌ స్వగృహ ఇళ్ల విక్రయానికి మరోమారు ఏర్పాట్లు చేశారు. అమ్మకానికి ఉన్న స్వగృహ ఇళ్లను గురువారం జిల్లా కలెక్టర్‌ నిఖిల పరిశీలించారు. కొన్నేండ్ల కింద మనోహ టౌన్‌షిప్‌ ఆధ్వర్యంలో తాండూరు-హైదరాబాద్‌ రోడ్డులో 173 ఇళ్లును ప్రభుత్వం నిర్మించింది. వాటిలో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. ఇంకొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని ఇళ్లను గతంలో వేలంలో విక్రయించగా, ప్రస్తుతం 72 ఇళ్లు ఉన్నాయి. స్వగృహ ఇళ్లను ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయించి ఆ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. దీంతో కలెక్టర్‌ రాజీవ్‌ స్వగృహ ఇళ్లను పరిశీలించి ఇళ్ల వివరాలను తెలుసుకున్నారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకు ఈ-వేలం  నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అమ్మకానికి ఉన్న ఇళ్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. కొనేందుకు ఆసక్తి ఉన్న వారు వైబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఏమైనా సందేహాలుంటే కలెక్టర్‌ కార్యాలయంలోని సహాయ కేంద్రంలో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.


  • ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటింటికి వెళ్లి చేపడుతున్న ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ నిఖిల అన్నారు. పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వ్యాక్సినేషన్‌ తీరుపై వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రెండోడో్‌సకు అర్హులను గుర్తించి వ్యాక్సిన్‌ వేయాలన్నారు. ఫస్ట్‌ డోస్‌ వేసుకొని రెండోడోస్‌ తీసుకోని వారి జాబితా తయారు చేసి వారికి ఫోన్‌చేసి అవసరమైతే ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్‌ వేయాలని సూచించారు. టీకా వేసుకోని 15-18ఏళ్ల లోపువారిని గుర్తించి వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. జ్వరం, సర్ది, వొంటినొప్పి తదితర లక్షణాలున్న వారికి హోమ్‌ ఐసోలేషన్‌ మెడికల్‌ కిట్లు ఇవ్వాలని నిఖిల ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్యారోగ్య అధికారి తుకారాం భట్‌, ఇన్‌చార్జి వైద్యులు రాకేష్‌, ఎంపీడీవో లక్ష్మప్ప, సూపర్‌వైజర్‌ పుష్పపలత, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఏఎన్‌ఎం కవిత, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2022-01-28T05:10:10+05:30 IST