రాజీవ్‌గాంధీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2022-05-22T05:46:30+05:30 IST

పేదల అభ్యున్నతికి పలు సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి దివంగత రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు యడ్ల శివాజీ అన్నారు.

రాజీవ్‌గాంధీకి ఘన నివాళి
పాలకొల్లులో రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నాయకుల నివాళి

పాలకొల్లు అర్బన్‌, మే 21 : పేదల అభ్యున్నతికి పలు సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి దివంగత రాజీవ్‌గాంధీ అని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు యడ్ల శివాజీ అన్నారు. రాజీవ్‌ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా శనివారం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి సమావేశం నిర్వహిం చారు. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు వర్ధనపు కాసు, కొలుకులూరి అర్జునరావు, షేక్‌ మదీనా బాషా, రొఖ్ఖాల బెన్నీపాల్‌, చాగంటి అంజిబాబు, రుంకాని శ్రీనివాసరావు, దుడే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

తణుకు : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ  వర్ధంతి సందర్భంగా  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తణుకు రాజీవ్‌ చౌక్‌ వద్ద గల రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాల  వేసి నివాళులర్పించారు. నాయకులు కడలి రామారావు, సవిరిగాని బోసు, దిర్శిపో రామకృష్ణ, ఆకుల సాయు, రుద్ర అన్నవరం, గౌస్‌ ఖాన్‌, కొరుగోల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూడెం  పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ విగ్రహానికి నరసాపురం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మార్నీడి బాబ్జి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు బాలబొమ్మల శ్రీనివాస్‌, పాలూరు శ్రీనివాస్‌, ఎం.అప్పారావు పాల్గొన్నారు.

భీమవరం టౌన్‌ : దేశంలో సాంకేతిక విప్లవం తీసుకురావడంలో రాజీవ్‌ గాంధీ కృషి చేశారని శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి అన్నారు. విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సభ నిర్వహించారు. న్యాయవాది ఉండపల్లి రమేష్‌నాయుడు, దళిత నాయకుడు గంటా సుందర కుమార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో నరహరి కృష్ణ, దాసిరెడ్డి వెంకటరమణ, పులపర్తి శ్రీనివాస్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T05:46:30+05:30 IST