Incessant Rainfall: ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వరుసగా నాలుగో రోజూ కుమ్మేసిన వాన.. మునిగిపోయిన ‘రాజీవ్ చౌక్’

ABN , First Publish Date - 2022-09-24T22:52:38+05:30 IST

ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) పరిధిలో వరుసగా నాలుగో రోజు కూడా వర్షం కుమ్మేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు

Incessant Rainfall: ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వరుసగా నాలుగో రోజూ కుమ్మేసిన వాన.. మునిగిపోయిన ‘రాజీవ్ చౌక్’

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) పరిధిలో వరుసగా నాలుగో రోజు కూడా వర్షం కుమ్మేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు హర్యానా (Haryana) గురుగ్రామ్‌ (Gurugram )లోని రాజీవ్ చౌక్ అండర్ పాస్(Rajiv Chowk underpass) మునిగిపోయింది. వరదనీటిలో పూర్తిగా మునిగిపోయిన అండర్ పాస్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. రాజీవ్ చౌక్ అండర్ పాస్ మునిగిపోవడంతో అప్రమత్తమైన గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (GMDA) రాజీవ్ చౌక్ సహా అన్ని అండర్ ‌పాస్‌లు, సబ్‌వేలను మూసివేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు  ఇవి మూసివేతలోనే ఉంటాయని ప్రకటించింది.




శనివారం మరోమారు కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతులో నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ, గురుగ్రామ్‌లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మనేసర్‌లో ఢిల్లీ-జైపూర్ హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఢిల్లీ, దానిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో శనివారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ విభాగం (IMD) యెల్లో అలెర్ట్ జారీ చేసింది. వీధులన్నీ నీటితో జలమయం అయ్యాయని, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లాలనుకునే వారు తమ ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

Updated Date - 2022-09-24T22:52:38+05:30 IST