రాజీవ్‌ ఆశయాలు సాధించాలి: మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-22T05:23:46+05:30 IST

ప్రధాని రాజీవ్‌గాంధీ ఆశయాలను సాధించాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజీవ్‌ ఆశయాలు సాధించాలి: మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి
కోదాడలో రాజీవ్‌గాంధీ వర్ధంతిలో పాల్గొన్న నాయకులు

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ప్రధాని రాజీవ్‌గాంధీ ఆశయాలను సాధించాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 40 ఏళ్ల వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి, సంస్కరణలకు బాటవేశారని అన్నారు.  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, తండుశ్రీనివా్‌సయాదవ్‌, తిరుమలప్రగడ అనురాధ,  చకిలం రాజేశ్వర్‌రావు, కొప్పుల వేణారెడ్డి పాల్గొన్నారు. కోదాడలోని రంగా థియేటర్‌ చౌరస్తాలో ఉన్న రాజీవ్‌ విగ్రహానికి పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు పార సీతయ్య, పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివా్‌సరావు, బషీర్‌, కందుల కోటేశ్వరరావు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్న, సాముల శివారెడ్డి, శ్రావణ్‌ పాల్గొన్నారు. చిలుకూరులో నాయకులు వేమూరి శ్రీనివాస్‌, హస్నా, రాయబారపు వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య పాల్గొన్నారు. మఠంపల్లి మండలంలోని పెదవీడు, మఠంపల్లి, మట్టపల్లి, చౌటపల్లి గ్రామాల్లో రాజీవ్‌ వర్ధంతిని నిర్వహించారు.  కార్యక్రమంలో ఎస్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ధీరావత్‌ నవీన్‌నాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు భూక్య మంజూనాయక్‌, ఆదూరి కిషోర్‌రెడ్డి పాల్గొన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంతో పాటు కల్మలచెర్వు, గానుగుబండ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి పయిడిమర్రి రంగనాథ్‌, బండా నర్సిరెడ్డి, పెండెం ముత్యాలు గౌడ్‌, సర్పంచ్‌ మూలగుండ్ల విజయసీతారాంరెడ్డి పాల్గొన్నారు. అనంతగిరి మం డలం అమీనాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, గౌరవ అధ్యక్షుడు కొండపల్లి వాసు, అమీనాబాద్‌ సర్పంచ్‌ కోటేశ్వరరావు, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ, గ్రామఅధ్యక్షుడు కోటేశ్వరరావు పాల్గొన్నారు. నేరేడుచర్ల, దిర్శించర్లలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్‌ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొణతం చినవెంకటరెడ్డి, నూకల సందీ్‌పరెడ్డి, మోదాల వెంకటసైదులు, బచ్చలకూరి ప్రకాష్‌ పాల్గొన్నారు. మోతెలో జరిగిన కార్యక్రమంలో కిసాన్‌సెల్‌ రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, వీరన్న, ధర్మారెడ్డి, యల్లయ్య, నాగయ్య పాల్గొన్నారు. మునగాలలో నిర్వహించిన రాజీవ్‌ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల లధ్యక్షుడు కొప్పుల జైపాల్‌రెడ్డి, చంద్రయ్య, మాజి సర్పంచ్‌ కాసర్ల కోటేశ్వరరావు, కుక్కడపు లక్ష్మయ్య, పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:23:46+05:30 IST