Abn logo
Sep 27 2020 @ 11:42AM

రైటర్‌గా రజినీకాంత్‌..!

Kaakateeya

పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, స్టైల్‌తో ఆకట్టుకున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్ త్వరలోనే రైటర్‌గా అవతారం ఎత్తబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై శివ దర్శకత్వంలో రజినీకాంత్‌ హీరోగా 'అణ్ణాత్తే' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కోవిడ్‌ ఎఫెక్ట్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే రీస్టార్ట్‌ కానుంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోరూపొందుతున్న ఈ సినిమాకు సూపర్‌స్టార్‌ డైలాగ్స్‌ రాస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రైటర్‌గా వర్క్‌ చేయడం రజినీకాంత్‌కు కొత్తేం కాదు. బాబా సినిమాకు ఆయనే స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. ఇప్పుడు మరోసారి రైటింగ్‌ విభాగంలో రజినీ వర్క్‌ చేయబోతున్నారని వినిపిస్తోన్న వార్తల్లో నిజానిజాలెంటో తెలియాలంటే చిత్ర యూనిట్‌ స్పందించాల్సిందే.  ఈ చిత్రంలో రజినీకాంత్‌ సహా ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తిసురేశ్‌ తదితరులు నటిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement