Jul 29 2021 @ 20:05PM

సూపర్ స్టార్ మళ్లీ బిజీ బిజీ!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌-శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అణ్ణాత్త’. ఈ చిత్రం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. నిజానికి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం ఈ చిత్రబృందం కోల్‌కతాకు వెళ్ళేందుకు ప్లాన్‌ చేసింది. కానీ, చివరి నిమిషంలో ఈ టూర్‌ రద్దు అయింది. దీంతో చెన్నైలోనే ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌ ముగిసిన తర్వాత కోల్‌కతాకు వెళ్ళాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉంది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా హీరో రజనీకాంత్‌ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ పనులు ప్రారంభించారు. 


స్థానిక మైలాపూరులోని ఓ ప్రైవేటు స్టూడియోలో ఈ చిత్ర డబ్బింగ్‌ పనులు సాగుతున్నాయి. ఇందులో రజనీకాంత్‌ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలావుంటే, ‘అణ్ణాత్త’ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. చిత్రాన్ని నవంబరు 4వ తేదీన దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్‌, నయనతార, ఖుష్బూ, మీనా, ప్రకాష్‌ రాజ్‌, జాకీ ష్రాఫ్‌, సూరి, జగపతి బాబు తదితరులు నటించగా డి. ఇమాన్ సంగీతం అందించారు.

Otherwoodsమరిన్ని...