రజినీ ‘అన్నాత్త’ : సెన్సార్ పూర్తి!

సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో రూపొందిన హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘అన్నాత్త’. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇదే సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘అన్నాత్త’ టీజర్ కు అభిమానులనుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో రజినీ పలికిన డైలాగ్స్ మెప్పించాయి. ‘దర్బార్’ తర్వాత రజినీకాంత్ నటించిన సినిమా కావడంతో అన్నాత్త మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు మేకర్స్. సెన్సార్ వారు చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ట్విట్టర్ లో ఓ పోస్టర్ ను షేర్ చేశారు.  కొంతకాలంగా సరైన సక్సెస్ లేని రజినీ కాంత్ ఈ మూవీతో తిరిగి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. 


Advertisement