Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 02 Jan 2022 08:18:05 IST

హమ్మయ్య...! అభిమానులకు తలైవా దర్శనం

twitter-iconwatsapp-iconfb-icon
హమ్మయ్య...! అభిమానులకు తలైవా దర్శనం

                      - ఇంటి బయటకొచ్చి అభివాదం


అడయార్‌(చెన్నై): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులను అనుగ్రహించారు. తమ అభి మాన హీరోకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన అభిమానులను సంతోషసాగరంలో ముంచెత్తారు. శనివారం ఉదయం పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన రజనీ చేతులూ పుతూ అభివాదం చేశారు. ఆయన్ని చూడగానే అభిమానులు ‘దైవమే... ఎంగ దైవమే’ అంటూ పులకించిపోయారు. అంతకు ముందు రజనీ తన ట్విట్టర్‌ ఖాతాలో ‘ప్రతి ఒక్కరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే, మరో నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ కూడా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 


ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

ఇదిలా ఉండగా కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి వచ్చిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

హమ్మయ్య...! అభిమానులకు తలైవా దర్శనం


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.