Abn logo
Sep 27 2021 @ 16:22PM

హైదరాబాద్: మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం

హైదరాబాద్: మణికొండ నాలాలో పడిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి గోల్డెన్ టెంపుల్ వద్ద  రజనీకాంత్ మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైన విషయం తెలిసిందే. రెండు కి.మీ. దూరంలో నెక్నమ్‌పూర్ చెరువు ఒడ్డున ఆయన మృతదేహం సోమవారం లభ్యమైంది. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రజనీకాంత్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మణికొండ మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలా ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption