Jul 10 2021 @ 09:52AM

ధనుష్ దర్శకత్వంలో రజినీకాంత్ 170..?

ధనుష్ దర్శకత్వంలో రజినీకాంత్ తన మైల్ స్టోన్ మూవీ 170 చేయనున్నారా..ప్రస్తుతం కోలీవుడ్‌లో అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అణ్ణాత్త' సినిమా చేస్తున్నారు. మాస్ డైరెక్టర్ శివ దీనికి దర్శకత్వం వహిస్తుండగా నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్‌కి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వీటిలో ఆయన 169వ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. అలాగే రజినీ 170వ చిత్రానికి ఆయన అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఐశ్వర్య, సౌందర్య దీనిని నిర్మిస్తున్నట్టు సమాచారం. 'పవర్ పాడి' అనే సినిమాతో ధనుష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో రెండవ సినిమా మొదలవబోతున్నట్టు తెలిపాడు. తాజా సమాచారం ప్రకారం ఆ మూవీ ఇదేనట. ఇందులో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Otherwoodsమరిన్ని...