Jun 18 2021 @ 18:40PM

నిరాధారమైన వ్యాఖ్యలు: రాజేశ్‌ టచ్‌రివర్‌

తనను దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌ వేధించారని మలయాళ నటి రేవతి సంపత్‌ చేసిన వ్యాఖ్యలపై రాజేశ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘‘నా మీద వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. నటి రేవతి నిరాధారమైన ఆరోపణలను చేస్తూ, చట్టపరమైన వేదికను ఆశ్రయించకుండా సోషల్‌ మీడియాలో ఏదైనా మాట్లాడొచ్చని దానిని వేదికగా ఎంచుకుంది. సామాజిక మాధ్యవం వల్ల ఎవరినైనా సులభంగా బ్లేమ్‌ చేయవచ్చు. ఆ యువతి చెప్పే మాటల్లో వాస్తవం లేదు. దయ చేసి మీడియా ఇలాంటి వారి మాటలను నమ్మవద్దు’’ అని రాజేష్‌ టచ్‌ రివర్‌ అన్నారు.