Oct 17 2021 @ 11:21AM

Rajendra Prasad: 'ఆ ఒక్కటి అడక్కు' అంటూ షాకింగ్ రిప్లై..

ఈసారి ఎంతో ఉత్కంఠబరితంగా సాగిన 'మా' ఎన్నికల గురించి ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ - మంచు విష్ణుల మధ్య జరిగిన పోటీలో అధ్యక్షపదవిని మంచు విష్ణు దక్కించుకున్నారు. ఇటీవల ప్రమాణ స్వీకారం కూడా చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీనియర్ నటుడు నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్‌ను మీడియావారు ప్రశించగా..ఆయన షాకింగ్‌గా రిప్లై ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రాజేంద్రప్రసాద్‌ పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలకు స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్ళారు. చిన్న తిరుపతిగా ఫేమస్ అయిన ఈ పుణ్యక్షేత్రంలో చిన్న వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన.. కాసేపు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'మా' ఎన్నికల గురించి రిపోర్టర్లు ప్రశ్నలడిగారు. దానికి వెంటనే ఆయన నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా పేరును చెప్పి.. ఇదే తన సమాధానం అన్నట్టుగా చెప్పారు. ఆ ఒక్కటి తప్ప మరేదైనా అడగొచ్చు అని కండీషన్ పెట్టి మరీ..మిగతా ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చారు. దాంతో ఎందుకు రాజేంద్రప్రసాద్ 'మా' ఎన్నికలపై స్పందించలేదని కొందరు చర్చించుకుంటున్నారు.