Advertisement

Bheemla Nayak : సీరియస్ పాత్రలో రాజేంద్రప్రసాద్?

టాలీవుడ్‌లో ఒకప్పుడు నెం.1 కామెడీ హీరోగా చక్రం తిప్పారు నటకిరీటి రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయినప్పటికీ.. ఆయన  కామెడీ టైమింగ్‌ను మాత్రం వదిలిపెట్టలేదు. తండ్రి, తాత, ఇంకా ప్రత్యేకపాత్రలు పోషిస్తున్నప్పటికీ అందులో తనదైన కామెడీ మార్క్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఆయన మొట్టమొదటి సారిగా ఓ క్రేజీ మూవీలో పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఆ సినిమా పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’ అవడం విశేషం. అందులో ఆయన ఓ పెక్యులర్ పొలిటీషియన్ గా నటిస్తున్నారట. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రానికిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పాత్రను ‘అలెన్సియర్ లే లోపేజ్’ చేశారు. కోషి పాత్రను సపోర్ట్ చేసే ఆ పాత్ర కనిపించేది కొన్ని సన్నివేశాల్లో అయినప్పటికీ.. మంచి పేరొచ్చింది. 


ఇక ‘భీమ్లా నాయక్’ విషయానికొస్తే.. ఇందులో రానా చేసే డేనియల్ శేఖర్ ను సపోర్ట్ చేసే పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో నటించి మెప్పించబోతున్నట్టు సమాచారం. అయితే అది పూర్తి సీరియస్ గా ఉండబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. అయితే ‘భీమ్లా నాయక్’ చిత్రంలో దానికి భిన్నంగా రాజేంద్ర ప్రసాద్ పాత్రను తీర్చిదిద్దారట త్రివిక్రమ్. ఒక విధంగా చెప్పాలంటే.. ఆ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తన నట విశ్వరూపం చూపిస్తారట. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి 12 వరకూ ఆగాల్సిందే. 

Advertisement
Advertisement