రజత్ కుమార్ కూతురి వివాహానికి ఎవరు స్పాన్సర్ చేశారు?: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-28T01:07:32+05:30 IST

తెలంగాణ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్ కుమార్ కూతురి వివాహానికి ఎవరు స్పాన్సర్ చేశారు? అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

రజత్ కుమార్ కూతురి వివాహానికి ఎవరు స్పాన్సర్ చేశారు?: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్ కుమార్ కూతురి వివాహానికి ఎవరు స్పాన్సర్ చేశారు? అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఫైవ్‌స్టార్ సౌకర్యాలతో అత్యంత ఖరీదైన వివాహానికి దాతలు ఎవరు? ట్వీట్టర్ వేదికగా నిలదీశారు. ఇది క్విడ్ ప్రో కో కాదా? అని ప్రశ్నించారు. ఒక పెద్ద సంస్థ షెల్ కంపెనీ బిగ్‌వేవ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ ఖరీదైన వివాహ ఏర్పాట్లు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. సీఎంఓలో ఇరిగేషన్‌శాఖ సీనియర్ అధికారికి, నీటి పారుదల కాంట్రాక్టర్ మధ్య అనుబంధంపై విచారణకు ఆదేశిస్తారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.



Updated Date - 2022-01-28T01:07:32+05:30 IST