పోటీలో గెలిచి.. బ్రిటిష్ దౌత్యాధికారిగా.. భారతీయ విద్యార్థినికి అరుదైన అవకాశం..

ABN , First Publish Date - 2021-10-11T03:14:07+05:30 IST

ఒక దేశానికి దౌత్యాధికారిగా వెళ్లాలంటే విదేశీ వ్యవహారాల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉండాలి. అనేక దౌత్యపరమైన అంశాల్లో విస్తృత అవగాహన ఉండాలి. కానీ.. రాజస్థాన్‌కు చెందిన అదితీ మహేశ్వరీ మాత్రం ఇవేమీ లేకపోయినా భారత్‌లో బ్రిటిష్ దౌత్యాధికారిగా పనిచేసే అవకాశం కొట్టేసింది.

పోటీలో గెలిచి.. బ్రిటిష్ దౌత్యాధికారిగా.. భారతీయ విద్యార్థినికి అరుదైన అవకాశం..

ఇంటర్నెట్ డెస్క్:  క దేశానికి దౌత్యాధికారిగా వెళ్లాలంటే విదేశీ వ్యవహారాల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉండాలి. అనేక దౌత్యపరమైన అంశాల్లో విస్తృత అవగాహన ఉండాలి. కానీ.. రాజస్థాన్‌కు చెందిన అదితీ మహేశ్వరీ మాత్రం ఇవేమీ లేకపోయినా భారత్‌లో బ్రిటిష్ దౌత్యాధికారిగా పనిచేసే అవకాశం కొట్టేసింది. హైకమిషనర్ ఆఫ్ ది డే పోటీలో పాల్గొని గెలుపొందిన ఆమెకు ఈ అరుదైన అవకాశం లభించింది. అక్టోబర్ 11న ప్రతి ఏటా  అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని 2017 నుంచీ భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్ ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ మారు అదితిని ఈ అద్భుత అవకాశం వరించింది.


 దీంతో.. శుక్రవారం నాడు ఆమె ఒక్క రోజు పాటు భారత్‌లో బిట్రన్ దౌత్యాధికారిగా పని చేసింది. ఈ సందర్భంగా ఆమె.. ఓ దౌత్యాధికారి విధులు, బాధ్యతలను ఎలా  ఉంటాయనేది స్వానుభవ పూర్వకంగా తెలుసుకుంది. పలు అధికారిక కార్యక్రమాల్లో బ్రిటిష్ కమిషనర్‌ హోదాలో అదితి పాల్గొంది. వచ్చే నెలలో గ్లాస్‌గోలో జరగబోయే సీఓపీ 26 నేతల సమావేశంలో ఉపయోగించబోయే జగ్వార్ జీరో ఎమిషన్ కార్లను ఆమె తొలిసారిగా వీక్షించింది. ఓ కారులో ఆమె కూర్చోగా.. బ్రిటిష్ కమిషనర్ దగ్గరుండి వాహనం తోలుతూ కారు పనితీరును విశదీకరించారు.


ఈ అద్భుతమైన అవకాశం తనకు లభించినందుకు అదితి ఉబ్బితబ్బిబైపోయింది. ‘‘వివిధ దౌత్యాధికారులతో సమావేశాలు, షీ లీడ్స్ ప్రోగ్రామ్‌లో భాగమైన మహిళలను కలుసుకోవడం మర్చిపోలేని అనుభవం’’ అని ఆమె వ్యాఖ్యానించింది. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన మిరాండా హౌస్ కాలేజీలో అదితి.. ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చదువుతోంది. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి కావడమే తన లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది. 

Updated Date - 2021-10-11T03:14:07+05:30 IST