Abn logo
Sep 22 2021 @ 04:04AM

రాజస్థాన్‌ వండర్‌ షో

  • మయాంక్‌, అర్ష్‌దీప్‌ శ్రమ వృథా
    పంజాబ్‌పై అద్భుత విజయం 
  • చివరి ఓవర్‌లో కార్తీక్‌ త్యాగి మ్యాజిక్‌


186 పరుగుల ఛేదనలో మయాంక్‌, రాహుల్‌ పంజాబ్‌కు 10 ఓవర్లలోనే 106 పరుగులు అందించారు. ఆ తర్వాత ఈ జోడీ వెనుదిరిగినా చివరి రెండు ఓవర్లలో చేయాల్సింది 8 పరుగులే. ఈ దశలో పంజాబ్‌ గెలుపుపై ఎవరికీ సందేహాలు లేవు. కానీ ఆఖరి ఓవర్‌లో పేసర్‌ కార్తీక్‌ త్యాగి అద్భుతమే చేశాడు. ఒక్క పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌కు అదిరిపోయే విజయాన్నందించాడు.


దుబాయ్‌: ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు గెలుపు ఖాయమనుకున్న పంజాబ్‌ కింగ్స్‌ దారుణంగా బోల్తా పడింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైశ్వాల్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), లూయిస్‌ (21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) మెరుపు ఆరంభాన్నివ్వగా మధ్యఓవర్లలో మహిపాల్‌ లోమ్రోర్‌ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43) ఆటాడుకున్నాడు. అర్ష్‌దీ్‌ప సింగ్‌కు 5, షమికి 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 రన్స్‌ చేసి ఓడింది. మయాంక్‌ అగర్వాల్‌ (43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), కేఎల్‌ రాహుల్‌ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కార్తీక్‌ త్యాగికి 2 వికెట్లు పడ్డాయి. 


శతక భాగస్వామ్యం: భారీ ఛేదనను పంజాబ్‌ ఆత్మవిశ్వాసంతో ఆరంభించగా, రాజస్థాన్‌ బౌలర్లు ఆరంభంలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. నాలుగో ఓవర్‌లోనే రాహుల్‌ 4,6,6తో 19 రన్స్‌ రాబట్టాడు. దీనికి తోడు పవర్‌ప్లేలోనే రాహుల్‌ ఇచ్చిన మూడు క్యాచ్‌లను ఆర్‌ఆర్‌ ఫీల్డర్లు వదిలేశారు. ఆరంభంలో నిదానంగా ఆడిన మయాంక్‌ పవర్‌ప్లే ముగిశాక కదం తొక్కుతూ 8వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. అదే జోరుతో పదో ఓవర్‌లో రెండు సిక్సర్లు సాధించి 34 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఓవర్‌కు పది రన్‌రేట్‌ చొప్పున సాగుతున్న వీరి జోరుకు వరుస ఓవర్లలో ఝలక్‌ తగిలింది. రాహుల్‌ను సకారియా.. మయాంక్‌ను తెవాటియా అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 120 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. 


చివరి ఓవర్‌లో డ్రామా: పంజాబ్‌కు 42 బంతుల్లో 60 రన్స్‌ కావాల్సి ఉండగా పూరన్‌ (32), మార్‌క్రమ్‌ (26 నాటౌట్‌) మూడో వికెట్‌కు 57 రన్స్‌ జోడించడంతో గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే చివరి ఓవర్‌లో కార్తీక్‌ త్యాగి వండర్‌ చేశాడు. విజయానికి 4 రన్స్‌ అవసర మవగా ఒకే పరుగిచ్చి పూరన్‌, హూడా (0)లను అవుట్‌ చేశాడు.  దీంతో చివరి బంతికి 3 రన్స్‌ కావాల్సి ఉండగా సింగిల్‌ కూడా రాకపోవడంతో రాజస్థాన్‌ గట్టెక్కింది. 



మెరుపు ఆరంభం లభించినా..: రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ధనాధన్‌ ఆటతీరుతో సాగింది. కానీ అవలీలగా 200 దాటుతుందనుకున్న స్కోరును చివర్లో పేసర్లు షమి, అర్ష్‌దీప్‌ కట్టడి చేశారు. తొలి ఓవర్‌లోనే జైశ్వాల్‌ 2 ఫోర్లు బాదగా తర్వాత ఇషాన్‌ను లూయిస్‌ లక్ష్యంగా చేసుకున్నాడు. అతడి 2 ఓవర్లలో ఓ సిక్సర్‌, 4 ఫోర్లతో రెచ్చిపోయాడు. కానీ అర్ష్‌దీప్‌.. లూయిస్‌ను పెవిలియన్‌ చేర్చాడు. అయితే పవర్‌ప్లేలో రాజస్థాన్‌ 57/1 స్కోరు సాధించింది. కెప్టెన్‌  శాంసన్‌(4) నిరాశపరిచినా లివింగ్‌స్టోన్‌ (25)తో కలిసి జైశ్వాల్‌ మూడో వికెట్‌కు 48 రన్స్‌ జోడించాడు. ఒక్క పరుగు తేడాతో యశస్వీ హాఫ్‌ సెంచరీకి దూరమయ్యాడు. ఆ తర్వాత మధ్య ఓవర్లలో మహిపాల్‌ కదం తొక్కాడు. 14వ ఓవర్‌లో వరుసగా 2 సిక్సర్లతో చెలరేగిన మహిపాల్‌.. హూడా వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో 6,6,4,2,2,4తో 24 రన్స్‌ రాబట్టాడు. అయితే చివరి నాలుగు ఓవర్లలో షమి, అర్ష్‌దీప్‌ 21 రన్సే ఇవ్వడంతో ఆర్‌ఆర్‌ 190లోపే ఇన్నింగ్స్‌ను ముగించింది.


స్కోరుబోర్డు

రాజస్థాన్‌: లూయిస్‌ (సి) మయాంక్‌ (బి) అర్ష్‌దీప్‌ 36; జైశ్వాల్‌ (సి) మయాంక్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 49; శాంసన్‌ (సి) రాహుల్‌ (బి) పోరెల్‌ 4; లివింగ్‌స్టోన్‌ (సి) ఆలెన్‌ (బి) అర్ష్‌దీప్‌ 25; మహిపాల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) అర్ష్‌దీప్‌ 43; రియాన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షమి 4; తెవాటియా (బి) షమి 2; మోరిస్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షమి 5; సకారియా (సి అండ్‌ బి) అర్ష్‌దీప్‌ 7; కార్తీక్‌ త్యాగి (బి) అర్ష్‌దీప్‌ 1; ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 185 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-54, 2-68, 3-116, 4-136, 5-166, 6-169, 7-175, 8-178, 9-185, 10-185. బౌలింగ్‌: షమి 4-0-21-3; పోరెల్‌ 4-0-39-1; దీపక్‌ హూడా 2-0-37-0; అర్ష్‌దీప్‌ 4-0-32-5; రషీద్‌ 3-0-35-0; హర్‌ప్రీత్‌ 3-0-17-1. 


పంజాబ్‌: రాహుల్‌ (సి) త్యాగి (బి) సకారియా 49; మయాంక్‌ (సి) లివింగ్‌స్టోన్‌  (బి) తెవాటియా 67; మార్‌క్రమ్‌ (నాటౌట్‌) 26; పూరన్‌ (సి) శాంసన్‌ (బి) త్యాగి 32; దీపక్‌ (సి) శాంసన్‌ (బి) త్యాగి 0; ఫాబియెన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 183/4; వికెట్ల పతనం: 1-120, 2-126, 3-183, 4-183; బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 4-0-30-0; సకారియా 3-0-31-1; త్యాగి 4-0-29-2; మోరిస్‌ 4-0-47-0; తెవాటియా 3-0-23-1; మహిపా ల్‌ లోమ్రోర్‌ 1-0-7-0; పరాగ్‌ 1-0-16-0. 

2 ఐపీఎల్‌లో అత్యంత వేగం (80 ఇన్నింగ్స్‌)గా 3 వేల రన్స్‌ పూర్తి చేసిన రెండో ఆటగాడు రాహుల్‌. గేల్‌ (75) టాప్‌లో ఉన్నాడు.


3 ఐపీఎల్‌లో పిన్న వయస్సు (22 ఏళ్ల 228 రోజులు)లోనే ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌.

క్రైమ్ మరిన్ని...