Abn logo
Apr 12 2021 @ 19:15PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా నేడు పంజాబ్‌ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కొద్ది సేపటిక్రితమే టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం శాంసన్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన వేలంలో తాము మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశామని అన్నాడు. విదేశీ ఆటగాళ్లైన మోరిస్, స్టోక్స్, బట్లర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను తుది జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. ఇక పంజాబ్ కెప్టెన్ రాహుల్ మాట్లాడుతూ.. తాను కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని, అయితే తాము బాగా ఆడాలనే విషయాన్నే దృష్టిలో పెట్టుకున్నామని, అందువల్ల టాస్ గెలిచినా, ఓడినా పెద్ద తేడా ఉండదని అన్నాడు. అలాగే తాజాగా వేలంలో తమ ఫ్రాంచైజీ చేసిన కొనుగోళ్ల విషయంలో కూడా సంతోషంగా ఉన్నామన్నారు. ఇక తొలిసారిగా జట్టులోకి షారూఖ్ ఖాన్, జ్యే రిచర్డ్‌సన్, రైలీ మెరిడిత్లను తీసుకున్నట్లు తెలిపాడు.Advertisement
Advertisement
Advertisement